– డివిజన్, మండల స్థాయిలోనే రెవెన్యూ క్లినిక్‌లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అదేవిధంగా గత వారం వరకు జిల్లాస్థాయిలో జరిగిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం అర్జీదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సోమవారం నుంచి డివిజనల్, మండలస్థాయిలో మాత్రమే నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజలు తమ రెవెన్యూ అర్జీలను ఈ క్లినిక్‌లలో అందజేయాలని సూచించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు కూడా నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News