తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “శాప్ మాస్టర్స్ స్పోర్ట్స్ లీగ్స్ – 2026” టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు 35+,40+,45+ సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలకు పోటీలు శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ రోజు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ టోర్నమెంటులో పురుషులు మరియు మహిళల, శిక్షకులు, సిబ్బంది సుమారు 150 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథుల గా జనార్ధన నాయుడు, (చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఏపీ ఎస్పీ డీసీ ఎల్, తిరుపతి) ఎం. మురళి కుమార్, (చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ ఎస్పీ డీసీ ఎల్, తిరుపతి), టి. అశోక్ కుమార్ (జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, ఏపీ ఎస్పీ డీసీ ఎల్, తిరుపతి) మరియు టెన్నిస్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు అతిధిలుగా పాలుగోన్నారు. జిల్లా స్థాయి లో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి పోటీలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (బ్యాడ్మింటన్) మార్చి14, 15, విజయనగరం (టెన్నిస్) మార్చి22, 23 15వ తేదీలలో జిల్లాలలో నిర్వహించబడతాయి. ఈ టోర్నమెంట్ ద్వారా జిల్లా స్థాయి ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇటువంటి కార్యక్రమాలతో క్రీడాకారులకు ఉత్సాహాన్ని పెంచుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తామని యన్. శశిధర్, జిల్లా క్రీడాభివ్రుద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News