Breaking News

మహిళా గ్రంథాలయ ఉద్యోగులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ప్రధమ శ్రేణి శాఖ గ్రంధాలయం నందు ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ముఖ్య అతిధిగా పాల్గొని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మహిళా గ్రంథాలయ ఉద్యోగులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలు అటువంటి మహిళలను గౌరవించడం మన సంప్రదాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మరియు రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర మహిళల జీవనోపాధికి, ఆర్థిక స్వేచ్చా, అభ్యున్నతి కోసం సెర్ప్, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు వివిధ కార్పొరేషన్ ల ద్వారా రాష్ట్ర మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఏదిగేలా ఎన్నో పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది అన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంటిలో చదువుకునే పిల్లలకు ఎంతమంది వుంటే అంతా మందికి 15000 చొప్పున విధ్యార్థులకు చదువుకు సాయం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. అలాగే శ్రీ శక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిదన్నారు. రాష్ట్రo లోని 1.08 కోట్ల కుటుంబాలకు ఉచితముగా ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తోందన్నారు. ఇటీవల మెగా డియస్సీ నిర్వహించి 8వేల మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, పోలీసు రిక్రూట్మెంట్ ద్వారా 900 మందికి పైగా మహిళా కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు కల్పించిదన్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి చొరవతో కేంద్రతో కలిసి బాలికలకు సర్వైకల్ కాన్సర్ నుండి ముందస్తు రక్షణగా ఉచితముగా వ్యాక్సిన్ ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఆర్. వి. వి. యస్. యస్. శర్మ, గ్రేడ్ 1 గ్రంధాలయ అధికారి జె. శివ ప్రసాద్, మహిళా గ్రంధాలయాధికారులు వసంత, లావణ్య, మీనాకుమారి, శ్రీముఖి, రెడ్డమ్మ, నాగరాణి ప్రమీల సుగుణ కుమారి పుస్తక నిక్షిప్త కేంద్రలో పనిచేస్తున్న మహిళా నిర్వాహకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *