-971 సంఘాలకు గాను బ్యాంక్ లింకేజి లోన్ – 9710 మంది లబ్దిదారులకు ₹148,22,00,000 నూట నలభైఎనియిది కోట్ల ఇరవైరెండు లక్షల రూపాయిలు లబ్ది
-450 మంది మహిళలకు మెమెంటోలు, చీరలు అందజేసి సన్మానం చేసిన -MLA బొండా ఉమామహేశ్వరరావు
-సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు మరింత అండ,మహిళా సాధికారతే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం – MLA బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ మెయిన్ రోడ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని విశిష్ట మహిళల సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వివిధ రంగాలలో సమాజానికి సేవలందిస్తున్న సుమారు 450 మంది మహిళా మణులను తన సొంత నిధులతో సత్కరించి మెమొంటోలు, చీరలు అందజేసి ఘనంగా సన్మానించారు..
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కులు కల్పించిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దార్శనికతతో మహిళా పక్షపాత ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు, మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని…డ్వాక్రా సంఘాల ద్వారా తరతరాలుగా వంటింటికే పరిమితమైన లక్షలాది మంది మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపిస్తూ వారిని పారిశ్రామికవేత్తలుగా, ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అలాగే మహిళల వంటింటి కష్టాలను తగ్గించేందుకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం 2.0 పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని అన్నారు.
మహిళలకు ప్రయాణ స్వేచ్ఛను, సమాన అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతూ మహిళలపై దాడులు, వేధింపులు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటూ మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
పిల్లలను చదివించేందుకు తల్లులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తున్నామని బొండా ఉమ గారు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి, సంతోషంగా ఉంటేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చెందుతుందని, మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సృష్టికి స్వరూపం, శక్తికి ప్రతిరూపం మహిళ అని, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం, కుటుంబాన్ని నిలబెట్టే త్యాగానికి ప్రతీక మహిళేనని అన్నారు. సహనంలో ఆమె ఆదర్శం, ఆమె జీవితమే గొప్ప సందేశమని కొనియాడారు..
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ఎదిగి నవ్యాంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఆకాంక్షించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తూ ప్రభుత్వపరంగా అందవలసిన అన్ని సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్ మోదుగల తిరుపతమ్మ, నాగవంశం కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఎరుబోతు రమణారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ దేవతోటి నాగరాజు, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, మాజీ కార్పొరేటర్లు ఎరుబోతు శ్రావణి, డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇంచార్జ్ మోత్కూరి కాసిం, మద్దాల రుక్మిణి, గరిమెళ్ళ నాగమణి, గరిమెళ్ళ రాధిక, కోటేశ్వరమ్మ, సుబ్బలక్ష్మి, సత్య, దుర్గ, పాపాలు,ఏళ్ల భవాని, పలగాని భాగ్యలక్ష్మి, సాయి, కెల్ల రవణమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News