Breaking News

ఘనంగా శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్యేషు దాసి.. కరణేశు మంత్రి… భోజ్యేశు మాత… అన్న పెద్దల మాటల గుర్తు చేసుకునే విధంగా ఘనంగా శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆదివారం గాంధీనగర్‌లోని కూరగాయల మార్కెట్ సమీపంలో శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో యువతకు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని సైకిల్ యాత్ర ద్వారా చైతన్యపరిస్తూ 34 రోజులపాటు సుమారు 600 కి.మీ. ప్రయాణించిన వీర వనితలు సబ్ ఇన్‌స్పెక్టర్ కె.రేవతి, హెడ్ కానిస్టేబుల్ జి.హైమావతి, కానిస్టేబుల్స్ ఎస్‌కె.బీబీ శైలజ, వి.ఉషారాణిలను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు, అడ్మిన్ డిసిపి కె.జి.వి.సరితల నేతత్వంలో ఈ అవగాహనా కార్యక్రమం నిర్వర్తించగలిగామన్నారు. కుటుంబ సభ్యులు సపోర్ట్ వుంటే మహిళలు అన్ని విధాలుగా రాణిస్తారన్నారు. గంజాయి పట్టుకోవడమే ఉద్దేశ్యం కాకుండా కుటుంబంలో పెద్దలుగాని, పిల్లలుగాని ఎవరైనా డ్రగ్స్ బాధపడితే ఎక్కువ బాధపడేది మహిళలన్నారు. వారు భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు కాబట్టి అటువంటి వారిని వెనకేసుకొచ్చి తప్పును కప్పిపుచ్చి ప్రోత్సహించకుండా అరికట్టడానికి సహకరించడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. మన పిల్లల మీద చూపే ప్రేమ అవతలవారికి ఇబ్బంది కలగకూడదు. అంటే తప్పును ప్రోత్సహించకూడదన్నారు. ఈ అవగాహనా కార్యక్రమంలో మహిళలు చాలా ఇంటరాక్ట్ అయ్యారన్నారు.
శ్రీ నక్కారాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులు అధ్యక్షత వహించి మాట్లాడుతూ మాతృదేవోభవ పితృ దేవోభవ ఆచార్యదేవోభవ అని నిరంతరం చాటిచెప్పేది మహిళలే అని అన్నారు. విద్యావంతులు, యువకులు, పిల్లలు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారన్నారు. ఈ మహమ్మారిని పారద్రోలి మహిళలు పిల్లల భవిష్యత్ కోసం పాటుపడాలన్నారు. నారీ అనేది ప్రతి మహిళకు సొంతమని, నారీ భేరీ వల్ల డ్రగ్స్‌పై దండయాత్రచేసి నారీ శక్తిని నిరూపించాలన్నారు. ప్రతి పురుషుని విజయానికి వెనుక ఒక మహిళ వుంటున్నది అక్షర సత్యమన్నారు. ప్రతి మహిళా విద్యను అభ్యసించి విద్యావంతురాలైతే ఏదైనా సాధించవచ్చన్నారు. దానివలన కుటుంబాభివద్ధితోపాటు, సమాజాభివద్ధి జరుగుతుందన్నారు. నేటితరం నిరంతరం శ్రమిస్తూ ఒక బాధ్యతాయుతంగా సంఘంలో ఉండాలని అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు వైపు మళ్లకుండా మంచిగా అభివృద్ధి పథంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మిలను అభినందించారు. అనంతరం పేద, వద్ధ మహిళలకు ఉచిత చీరల పంపణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మాలెంపాటి వెంకట కష్ణయ్య, ఝాన్సీ లెక్చరర్, కె.వెంకటేశ్వరమ్మ బ్యాంక్ ఎంప్లాయ్, భారీ సంఖ్యలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *