విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు శాతం ఉన్న రజకులులో ఒక్కరూ ఎమ్మెల్యే కాలేదని, సామాజిక న్యాయం జరగాలంటే బీసీలు, ముస్లింలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా శాసనసభలు, రాజ్యసభ,శాసన మండలిలో రిజర్వేషన్లు కల్పించడమే మార్గమని విజయవాడలో జరిగిన రజక (చాకలి) సమాజం సమ్మేళనంలో నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న డా. జె. పూర్ణచంద్రరావు, ఐపీఎస్ (విరమణ), మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు మైనార్టీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
డా. జె. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినా సామాజిక, రాజకీయ సమానత్వం ఇంకా పూర్తిగా సాధించబడలేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1952 నుంచి 2024 వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగి మొత్తం 2902 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని, అయినప్పటికీ రాజకీయ అధికారం ప్రధానంగా కొన్ని ఆధిపత్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమైందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తక్కువ శాతం జనాభా ఉన్న రెడ్డి, కమ్మ కులాలు కలిసి ఈ కాలంలో 1200కిపైగా ఎమ్మెల్యేలను తయారు చేశారని ఆయన వివరించారు. జనాభాలో మెజారిటీ మనది… కానీ అధికారంలో మైనారిటీ మనమే!”రాష్ట్రంలో దాదాపు 3 శాతం జనాభా ఉన్న రజక సమాజానికి కూడా రాజకీయ అవకాశాలు అసలు లభించడం లేదని ఆయన పేర్కొన్నారు.మన చేతులు రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి… కానీ అధికారంలో మనకు స్థానం ఎందుకు లేదు ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలతో ఓటును ప్రభావితం చేసే పరిస్థితిని విమర్శిస్తూ ఆయన అన్నారు వెయ్యి రూపాయల కోసం ఓటు అమ్మితే… ఐదు సంవత్సరాల భవిష్యత్తు అమ్మినట్టే” అని అన్నారు.
Prajavartha Online Telugu News