రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి మొత్తం 205 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. విభాగాల వారీగా అందిన అర్జీల్లో రెవెన్యూ (రెవెన్యూ క్లినిక్) కు 87, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 57, హోం శాఖకు 11, ఎనర్జీ శాఖకు 8, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు 5, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, పశుసంవర్ధక, పాలు మరియు మత్స్య శాఖ, పాఠశాల విద్య శాఖలకు చెంది 3 అర్జీలు చొప్పున అందాయన్నారు. జల వనరుల, ఆర్థిక శాఖ, వ్యవసాయం, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మైనార్టీస్ వెల్ఫేర్ శాఖలకు చెందిన అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజలు తమ సమస్యలను 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, అలాగే మీకోసం వెబ్ పోర్టల్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అందిన అర్జీలను సంబంధిత శాఖలు సత్వరంగా పరిశీలించి పరిష్కరించేందుకు వ్యక్తిగత బాధ్యతతో పనిచేయాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ సూచించారు.అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ అధికారులు మండలాల వారీగా పర్యవేక్షించి సమర్థంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ ద్వారా ఆర్డీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News