-మహిళా సమస్యల పరిష్కారమే ధ్యేయం
-మార్చి 12 ఆర్ అండ్ బి అతిథి గృహం – నూతన సమావేశ మందిరంలో
– జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయు రాయపాటి శైలజ ది.12.03.2026 తేదీన R&B Guest House new meeting Hall నందు “జన్ సున్వాయి” స్పెషల్ డ్రైవ్ నిర్వహించుచున్నారు. ఈ డ్రైవ్ లో జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీస్ సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. ఏదైనా గృహింస, ఇతర అన్యాయాలకు గురి అయ్యే మహిళలు ఈ స్పెషల్ డ్రైవ్ లో ఫిర్యాదు చేయ వచ్చునని, వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకొని వేగవంతంగా ఫిర్యాదులను పరిష్కరించనున్నట్లు శ్రీదేవి తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News