Breaking News

నగరంలో డీసిల్టింగ్ పనులు ప్రణాళిక తో చెయ్యాలి

-మ్యాప్ లో మార్క్ చేసుకుంటూ డీసిల్టింగ్ పూర్తిస్థాయిలో చేయాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వర్షాకాలం దృశ్య నగరంలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను ఒక ప్రణాళికతో చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం శాఖాధిపతులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డీసి ల్టింగ్ పనులను పక్కా ప్రణాళికతో చేయాలని, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే డీసిల్టింగ్ పూర్తిస్థాయిలో చేయగలమని అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న కాలువలను మ్యాప్ ల ఆధారంతో, మైనర్ డ్రైన్లు, మేజర్ డ్రైన్లు శాఖల సమన్వయంతో ఒకేసారి పూర్తి చేయాలని, అప్పుడే డీసిల్టింగ్ చేసినందుకు ఫలితం ఉంటుందని, శాఖల సమన్వయం లేకుండా ముందు మేజర్ డ్రైన్ లో డీసిల్టింగ్ చేసి, తర్వాత మైనర్ డ్రైన్లు డీసిల్టింగ్ చేసిన ఉపయోగముండదని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో డీసిల్టింగ్ జరిగిన తర్వాత మ్యాప్ లో ఆ ప్రాంతంలో ప్రజారోగ్యం వారు ఒక రంగుతో ఇంజనీరింగ్ సిబ్బంది వారు ఒకరంగుతో మార్క్ చేసుకోవాలని, సచివాలయంలో రెండు శాఖవు డీసిల్టింగ్ మొత్తం పూర్తిచేసిన తర్వాత అధికారులు ఒకసారి పరిశీలించి, ఏవైనా గ్యాప్ ఉన్నచో అవి కూడా పూర్తిస్థాయిలో డీసిల్టింగ్ చేస్తేనే ఆ ప్రాంతంలో డీసిల్టింగ్ పూర్తిస్థాయిలో జరిగిందని అన్నారు. అదే విధంగా నగరం మొత్తం డిసిల్టింగ్ చేసి కాలువలో గల చిట్టచివరి ప్రాంతం వరకు డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తేనే వర్షాకాలంలో రోడ్డుపైన నీటి నిల్వలు ఉండవని అన్నారు. నగరంలో పెరుగుతున్న దోమల సమస్యలను నివారించేందుకు, లాంగ్ ఆర్మ్ తో కలువలో పూడికలు తీసే పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అనధికార కట్టడాలు ఏమైనా ఉన్నాయో వెంటనే తొలగించాలని, పన్ను వసూళ్ల డ్రైవ్ ను విస్తృతంగా చేయాలని, నగరంలో ఆకస్మిక తన కీలు నిర్వహించి అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా చూసుకోవాలని ఫైర్ సిబ్బందిని అన్నారు. ఈ సమావేశం లో అదనపు కమిషనర్లు డాక్టర్ డి.చంద్రశేఖర్, ఎ.రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్) పి. సత్య కుమారి, సూపరిండెంట్ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, అకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాలకృష్ణ, ప్రభాకర్, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, ఆర్.యఫ్ ఓ.మల్యాద్రి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, బయాలజిస్ట్ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *