Breaking News

ప్రమోషన్లలో రిజర్వేషన్లలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదోన్నతులను పునః సమీక్ష చేయ్యాలి…

-ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రమోషన్లలో రిజర్వేషన్లు వలన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేయుచున్న ఓ.సి, ఓ.బి.సి, బి.సి మరియు మైనారిటీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడ బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం “సమానత్వం కోసం మహాసభ” జరిగింది. ఈ సమావేశంలో ఎం.నాగరజ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఈక్వాలటీ ఫోరం (సుప్రీంకోర్టులో ఎం. నాగరాజ్ వర్సస్ యానియన్ ఆఫ్ ఇండియా కేసు విజేత) ముఖ్య అతిధి వక్తగా పాల్గోని సుప్రీంకోర్టులో ప్రమోషన్లల్లో రిజర్వేషన్ల అనే అంశం పై వచ్చిన అనేక తీర్పులు దాని తదనంతరం పరిణామాలు గురించి ఉద్యోగులకు తెలియజేశారు. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్స్‌కు మేము వ్యతిరేకంకాదని, ప్రమోషన్లలో రిజర్వేషన్స్ పై అనేక సంవత్సరాలుగా పోరాడుతూ వివిధ రాష్ట్రాలలో సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయించి మెరిట్‌ను కాపాడుతున్నామని తెలిపారు. దానిలో భాగంగా గతంలో చాలా సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చామని తెలియజేశారు. ఈ సందర్భంగా వివిద ఓ.సి, ఓ.బి.సి, బి.సి మైనారిటీ సంఘాల ముఖ్యనేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుని ఎ.పి హైకోర్టు అమలు చెయ్యమన్నా, చీఫ్ సెక్రటరీని కోర్టుకు వ్యక్తిగతంగా హజరై అమలుకు హమీ ఇచ్చిన అనేక హైలెవల్ కమిటీలు రిపోర్టులు సుప్రీంకోర్టు తీర్పుని అమలుచెయ్యాలన్నా కూడా మళ్ళీ మంత్రుల కమిటీ వెయ్యడం అధికారుల కమిటీలు మళ్ళీ వేయడం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేయుచున్న ఓ.సి, ఓ.బి.సి, బి.సి మైనారిటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలియజేసారు. కూటమి ప్రభుత్వానికి ఓ.సి, ఓ.బి.సి, బి.సి మైనారిటీ ఉద్యోగులు అనుకూలముగా ఓటు వేసినా సుప్రీంకోర్టు తీర్పు అమలు చెయ్యకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారని తెలియజేశారు. ప్రస్తుత విధానంలో ఉన్న లోపం కారణంగా ఉన్నత స్థాయి పోస్టులలో ఎస్.సి, ఎస్.టి ఉద్యోగుల సంఖ్య వారి కోటాకు మించి ఎక్కువగా ఉన్నదని దానివల్ల ఇతర వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయలేదని ధిక్కరణ కేసు వేసి 7 సం॥ గడిచిన హైకోర్టు కేసుపై ఉదాసీనం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులపై నమ్మకం పోతుందని అన్నారు. ఈ అంశముపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టి సారించాలని, కొందరి అధికారులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అనేక రాష్ట్రాలలో మరియు పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా సుప్రీంకోర్టులలో ఇచ్చిన తీర్పును అమలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరగా అమలు చేసి పదోన్నతులను పునఃసమీక్ష చెయ్యాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రమోషన్లలో రిజర్వేషన్లలో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు అమలు చేయనిచో త్వరలో అన్ని శాఖా ఉద్యోగులతో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి డా. అప్పారావు రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షత వహించగా కోట శ్రీనివాస్ స్టేట్ సెక్రటరి, ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం, ఏ.పి చాప్టర్, గత సంవత్సర రిపోర్టును, భవిష్యత్ కార్యాచరణను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ నాయకులు జి.కరుణాకర్‌రెడ్డి, ఎస్.చంద్రశేఖర్, ఎస్‌పిఆర్ విఠల్‌కుమార్, షేక్ గాలీబ్ షాహిద్, సయ్యద్ నజీర్ ఉల్ హక్ తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఓ.సి, ఓ.బి.సి, బి.సి మైనారిటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *