– కొలుసు పార్థసారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిల్యాండ్ జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసి, మూడోసారి పొట్టి ప్రపంచకప్ ను ఇండియాకు అందించిన భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు భారత క్రికెట్ జట్టు ఆడిన తీరు టీమ్ వర్క్ కు నిదర్శనం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించిన విధానాన్ని చూసి యావత్ భారతదేశం మురిసిపోయింది. 96పరుగుల తేడాతో ఫైనల్స్ మ్యాచ్ లో గెలుపొందడం అత్యద్భుతం. బ్యాట్స్ మెన్లు, బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి భారత దేశానికి అందించిన ఈ విజయం ఎప్పటికీ మధుర జ్ఞాపకమే. టీ-20 వరల్డ్ కప్ 2026 సీజన్ ప్రారంభం నుండి వరుస విజయాలతో రాణిస్తున్న ఇండియా టీమ్….ఈరోజు ఫైనల్స్ లోనూ ఏమాత్రం తగ్గేదే లే……అన్న విధంగా ఘన విజయం సాధించింది. జట్టు సభ్యులందరికీ హార్థిక శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో విజయాలతో దేశ కీర్తిప్రతిష్టలను నిలబెడుతూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
Prajavartha Online Telugu News