Breaking News

ఏపీ విద్యా సంస్కరణలు భేష్

-ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సమగ్ర శిక్ష ఢిల్లీ ప్రతినిధుల బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యారంగంలో అమలువుతున్న వినూత్న కార్యక్రమాలను పరిశీలించేందుకు ఢిల్లీ సమగ్ర శిక్ష విభాగానికి చెందిన 25 మంది సభ్యుల ప్రతినిధి బృందం మన రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. సోమవారం ప్రారంభమైన ఈ పర్యటన సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. తో వారి కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో పాటు, గ్యారెంటీడ్ FLN అమలు తీరు, డిజిటల్ విద్య, తరళ్, మెగా పీటీఎంలో సమాజ భాగస్వామ్యం, గ్రీన్ పాస్ పోర్ట్, ATL, PAL, STEM ల్యాబ్స్, పాఠశాల గ్రంథాలయాలు అభివృద్ధి, హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలు, భవిత కేంద్రాలు, ఆటిజం సపోర్ట్ సెంటర్ సేవలు, కేజీబీవీల్లో బాలికలకు అందిస్తున్న సౌకర్యాలతో పాటు స్కిల్ ఎడ్యుకేషన్, పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధి గురించి ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., వివరించారు. ఏపీ సంస్కరణలను మెచ్చుకుంటూ ఢిల్లీ ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించారు.
ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీలు డా. ఎం.ఆర్.ప్రసన్న కుమార్, కె.రవీంద్రనాథ్ రెడ్డి, కేజీబీవీ సెక్రటరీ డి.దేవానందరెడ్డి, SAMO అడిషనల్ డైరెక్టర్ కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పర్యటనలో…
కృష్ణా జిల్లాలో ధావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ స్కూల్, పెనమలూరు జిల్లా పరిషత్ పీఎంశ్రీ స్కూల్, ఎస్సీఈఆర్టీలను సందర్శించారు. గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మెటిరీయల్, క్లిక్కర్, కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, లైబ్రరీ వంటివి పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *