Breaking News

బాల కార్మికుల నివారణకు చర్యలు ఏంటి – లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో బాల కార్మికుల నివారణ, అసంఘటిత రంగం, కుటుంబ ఆధారిత చిన్నతరహా పరిశ్రమల్లో పిల్లలను ఉపయోగిస్తున్న అంశాలపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కర్లందాజే సమాధానం ఇచ్చారు.

బాల కార్మికుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం 1986 ను అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను ఏ విధమైన పనుల్లోనూ నియమించడం పూర్తిగా నిషేధించబడిందని పేర్కొన్నారు. అలాగే 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాల, బాలికలను ప్రమాదకరమైన పనుల్లో పనిచేయించడం కూడా చట్టం నిషేధించిందని వివరించారు.

అయితే పిల్లలు పాఠశాల సమయం తరువాత లేదా సెలవుల సమయంలో మాత్రమే ప్రమాదకరం కాని కుటుంబ ఆధారిత పనుల్లో సహాయం చేయడానికి అనుమతి ఉందని మంత్రి పేర్కొన్నారు. 2016లో ఈ చట్టంలో మార్పులు చేసి “పిల్లలు” అనే పదానికి నిర్వచనాన్ని ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లో పేర్కొన్న విదంగా తప్పనిసరి విద్యా వయస్సుకు అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.

చట్టం అమలును మరింత బలోపేతం చేయడానికి జిల్లా స్థాయిలో జిల్లా సమన్వయ అధికారి, ప్రత్యేక కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. బాల కార్మికుల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటిపై చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ వేదికను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ వేదిక ద్వారా బాల కార్మికులకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఎంపీ వ్యాఖ్య:
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు, భవిష్యత్ భారత నవనిర్మాణ సారదులు విద్యాభ్యాసం చేయాల్సిన వయసులో వారి ఆశలను, హక్కులను చిదిమేయడం నేరమని అన్నారు. ప్రతి పిల్లవాడికి విద్య పొందే హక్కు ఉందని, చిన్న వయస్సులోనే పనుల్లోకి వెళ్లే పరిస్థితులు రాకుండా ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాల కార్మికుల వినియోగాన్ని నివారించడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలనని ఆయన కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *