-జేఏసీ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ & ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ )నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం లో భాగంగా విజయవాడ వేదికగా గులాముద్దీన్ నగర్ రిజర్వాయర్ ట్యాంక్ వద్ద ఈరోజు ఉదయం నూతన JAC కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ చైర్మన్ పిట్టా మహేష్ బాబు, కార్యదర్శి ఆర్ సత్యము ,కోశాధికారి షేక్ కరీముల్లా మరియు రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జేఏసీ కార్యచరణ మరియు ముఖ్య డిమాండ్లు గౌరవ చైర్మన్, కార్యదర్శి, కోశాధికారి తెలియజేస్తూ 2019లో అప్పటి టిడిపి ప్రభుత్వం జీవో నెంబర్ 96 ప్రవేశ పెడుతు మినిమం టైం స్కేల్ మున్సిపల్ Ph & Non ph కార్మికులకు Go విడుదల చేసిందని ఆ జీవోను అదే రోజు సాయంత్రానికి నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. ఆ జీవోని కొనసాగిస్తూ మరల అదే జీవో ను పునరావృతం చేసి మున్సిపల్ కార్మికులకు MTS చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. క్యాటగిరి వర్గీకరణ ,రిటైర్మెంట్ అయిన వారికి సి ఎఫ్ ఎం ఎస్ లో వారి పేర్లు తొలగించి వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలని సంస్థకు చేసిన సేవలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకర బహుమతిని ప్రకటించే విధంగా కూడా చేయాలని, డిపిఓ ,డిఈఓ ,వర్క్ ఇన్స్పెక్టర్ల, యు డి ఎస్ వర్కర్లకి ఈఎస్ఐ పరిమితి పెంచి హెల్త్ కార్డులు కూడా అమలు చేయాలని, జీవో నెంబర్ 25 ప్రకారం గౌరవ ఔట్సోర్సింగ్ ఉద్యోగి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా అందించే వారి కుటుంబానికి ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఇదేవిధంగా వివిధ సమస్యలపై కార్యచరణను ప్రకటించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News