Breaking News

అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏపిఇట్కో డిపిఆర్ ని త్వరగా సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఏపిఇట్కో డిపిఆర్ ని త్వరగా సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ (ఏపిఇట్కో) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అందులో భాగంగా ఏపిఇట్కో ప్రతినిధులు రూపొందించిన డిపిఆర్ ని పరిశీలించామని,అందులో సూచించిన మార్పులతో త్వరలో సమగ్ర డిపిఆర్ అందించాన్నారు. డిపిఆర్ పై ఏపిఇట్కో ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని జిఎంసి ఎస్ఈ ని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *