Breaking News

స్వర్గపురిలో మరమ్మతులన్నీ త్వరగా పరిష్కరించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్గపురిలో మరమ్మతులన్నీ త్వరగా పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక, రాణి గారి తోట ప్రాంతాలన్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని స్వర్గపురి అన్నిటిలో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, అక్కడ ఎటువంటి సమస్య ఉన్న వెంటనే పరిష్కరించి అన్ని వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణలంక నేతాజీ బ్రిడ్జి వద్ద ఉన్న వర్టికల్ గార్డెను అభివృద్ధి చేయాలని, అందంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఉన్నారు. ఏపీఎస్ఆర్ఎం అన్న క్యాంటీన్ పరిశీలించి అన్న క్యాంటీన్లో ఎటువంటి సమస్య ఉండరాదని నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. షమ్మి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *