Breaking News

స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో సాధించిన విజయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ భాద్యత తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ సర్వేక్షణ్ లో ర్యాంక్ కోసం కృషి చేయడం అంటే నగరాన్ని క్లీన్, హెల్తీ నగరంగా తీర్చిదిద్దుకోవడమేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో భాగంగా సాహస్, వాష్ స్వచ్చంద సంస్థలు బుధవారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని డిఆర్ఎం కన్వెన్షన్ హాల్లో ప్రజారోగ్య విభాగ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో సాధించిన విజయాలను కొనసాగిస్తూ ఈ ఏడాది మరింత మెరుగైన స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ భాద్యత తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరి చేసుకొని, ప్రతి వార్డ్ లో ప్రజలు సంతృప్తి చెందేలా పారిశుధ్య పనులు జరిగేలా శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యర్ధాల విభజనపై ప్రజలకు అవగాహన కల్గించాలని, ప్రతి వార్డ్ లో ఆర్ఆర్ఆర్ సెంటర్లను ఫంక్షనింగ్ లోకి తీసుకురావాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర౦ స్వచ్చాంధ్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటున్నారంటే స్వచ్చతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించవచ్చన్నారు. వార్డ్ కి ఒక క్లస్టర్ కంపోస్ట్ యూనిట్, మైక్రో ప్యాకెట్ లో 50 ఇళ్లల్లో హోమ్ కంపోస్ట్ తయారీ జరగాలన్నారు. వార్డ్ లలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్ధాల సేకరణ పాయింట్స్ ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా తెలియచేయాలన్నారు. గార్బేజ్ వల్న్రబుల్ పాయింట్స్ ఉండడానికి వీలు లేదని, రోడ్లు, డ్రైన్లలో వ్యర్ధాలు వేసే వారిపై అపరాధ రుసుం విధించాలన్నారు. డ్రైన్లలో ఏర్పాటు చేస్తున్న గ్రిల్ దగ్గర ప్రతి రోజు వ్యర్ధాలను తొలగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన సాహస్, వాష్ స్వచ్చంద సంస్థలు 3 రోజుల పాటు గుంటూరు నగరంలోని ప్రజారోగ్య కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు స్వచ్చ సర్వేక్షణ్ లోని ప్రధాన ఇండికేటర్లపై అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, సాహస్, వాష్ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *