మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికి చేరువ చేసి వారు ప్రయోజనం పొందేలా కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5 వ బ్లాక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన 6 వ కలెక్టర్ల సదస్సు లో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, శాఖలధిపతులు, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో పాటు పలువురు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాంధ్ర, జీఎస్డీపీ లక్ష్యాలు, జిల్లాల్లో విజయవంతమైన కార్యక్రమాలపై సమీక్షించారు. పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీఎస్, సుపరిపాలనలో సాంకేతికత, పెట్టుబడులు, వైద్యారోగ్యం, సూపర్ సిక్స్ పథకాలపై చర్చించారు.
వివిధ అంశాలపై ముఖ్యమంత్రి లక్ష్యాలను నిర్దేశించి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
వివిధ వర్గాలకు అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయమై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు
*ఈ మేరకు అధికారులు-ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి. కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు.
*వ్యవసాయానికి ప్రొత్సహమిచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు.
*ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో వ్యవసాయం కోసం అత్యున్నత సంస్థ ఏర్పాటు చేద్దామన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు.
• ఉన్న పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నామన్నారు.
• గతంలో కార్యాలయాల్లో కూర్చుని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి వర్చువల్ పనివిధానాన్ని తీసుకువచ్చామన్నారు.
• గడచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకువచ్చామన్నారు.
• ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయని, వీటి అమలులో ఉదాసీనత వద్దన్నారు.
• 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా తీసుకువచ్చిన 10 సూత్రాలు అమలు చేస్తే సుపరిపాలన అందించేందుకు వీలవుతుందన్నారు.
• నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు.
• సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు.
• ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలన్నారు.
• *13 తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని మూడో విడత అమలు చేస్తున్నామన్నారు. . *
• కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము వేస్తుందన్నారు.
• రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేర్వేరు ప్రతినిధులు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని సమర్ధంగా తీసుకెళ్దామన్నారు.
• ఖరీఫ్ సాగు కోసం మే 15 తేదీన నీటిని విడుదల చేస్తున్నామన్నారు. సీజన్లో ముందుగానే నీరు ఇస్తామన్నారు. .
• ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు
• ఇంద్ర ధనస్సు పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు అమలు చేస్తున్నామన్నారు
• గత పాలనలో ట్రూ ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారు. తొలిసారి ట్రూ డౌన్ చేసామన్నారు.
• 4600 కోట్ల రూపాయల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. .
• ఈ ఏడాది 39 పైసల మేర విద్యుత్ కొనుగోలు ధర తగ్గిస్తామన్నారు.
• కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్లు ఇస్తున్నామన్నారు. .
• సబ్ స్టేషన్ యూనిట్ గా మైక్రో గ్రిడ్ ఏర్పాటుతో పాటు ప్రోజ్యూమర్ కాన్సెప్టును సమర్ధంగా అమలు చేయాలన్నారు.
• వ్యవసాయానికి ప్రొత్సహిమిద్దాం… ఐటీ, ఏఐ, క్వాంటం ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం ఓ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
• ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేద్దామన్నారు
మచిలీపట్నం నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ చంద్రశేఖర రావు, విజిలెన్స్ అధికారి పిజిఆర్ఎస్ నోడల్ అధికారి పోతురాజు, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, మత్స్యశాఖ జే డీ అయ్యా నాగరాజా, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేంద్ర బాబు, డిఎస్ఓ మోహన్ బాబు, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, ఆర్టీసీ పిఓ గోపాల్, జిల్లా ఉపాధి కల్పనాధికారి బ్రహ్మం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News