Breaking News

స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం…మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీ శక్తి పథకం అమలుపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలను రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొందిన సంక్షేమ పథకమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం భాధ్యతతో ఈ పద్ధకాన్ని అమలు చేస్తుంటే జగన్ కడుపు మండుతుందని, పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 మేర లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు సుమారు 50 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసినట్లు చేశారని , ఎక్కువగా ప్రయాణం చేసే ఐదు రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని ఈ సేవలే విరివిగా అందుబాటులో ఉంటున్నాయని మంత్రి తెలిపారు

వైసీపీ హయాంలో ఒక్క బస్సు కొనలేదు
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం సుమారు 1450 కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ హయాంలో టికెట్ చార్జీల పెంపు, బస్సుల సర్వీసుల నిలిపివేత
వైసీపీ పాలనలో బస్సు టికెట్ చార్జీలు మూడు సార్లు పెంచారని, వందల సంఖ్యలో బస్సు సర్వీసులను నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. ఆ సమయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడంలో కూడా నిర్లక్ష్యం చేశారని తెలిపారు.

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి చర్యలు
గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ ఎదుర్కొన్న అనేక సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం , అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మహిళల సాధికారత, ప్రజా రవాణా బలోపేతం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *