Breaking News

కలెక్టర్ల సమావేశంలో ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

-ఆర్టీసీ సిబ్బంది సేవలకు కితాబు
-గత ప్రభుత్వంతో పోలిస్తే ఆర్టీసీ సేవల్లో గణనీయమైన మెరుగుదల
-పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రవాణా శాఖ మంత్రి పనితీరును ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది సేవలు, పథకాల అమలు స్థాయి 78 శాతానికి పైగా ఉందని తెలిపారు.

బస్ స్టాండ్ల సౌకర్యాలు కూడా మెరుగుపడుతున్నాయని, ప్రస్తుతం 55 శాతం సంతృప్తి స్థాయి నమోదైందని పేర్కొన్నారు.

ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన చాలా హుందాగా ఉందని సీఎం కితాబిచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. సమర్థవంతమైన ప్రభుత్వ మంచి పాలనకు నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *