Breaking News

ఏపీ పర్యాటక రంగంలో సరికొత్త శకం..ఏఐ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

-సాంస్కృతిక పర్యాటకానికి సరికొత్త రూపు..ఏరోస్ ఇన్నోవేషన్‌తో ‘కల్చరల్ ఏఐ’ భాగస్వామ్యం
-పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా నిలపడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్న మంత్రి కందుల దుర్గేష్
-ప్రపంచంలోనే మొట్టమొదటి ‘లార్జ్ కల్చరల్ మోడల్స్’ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై ముంబయి లో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI)ఎక్స్‌పోలో రెండో రోజు కీలక చర్చలు
-ఏపీ వారసత్వ సంపదకు డిజిటల్ సొబగులు..పర్యాటక రంగంలో సాంకేతిక విప్లవం తెస్తూ దేవాలయాలు, వారసత్వ కట్టడాల వద్ద పర్యాటకులకు అద్భుతమైన ‘డిజిటల్ ఇమ్మర్సివ్’ అనుభూతులు కల్పిస్తామని వెల్లడి
-క్రియేటర్ ఎకానమీ’లో ఏపీ యువతకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్..కళాకారులు, క్రియేటర్లకు బంపర్ ఆఫర్..పర్యాటక రంగంలో సరికొత్త ఉపాధి మార్గాలు కల్పిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్

అమరావతి/ముంబయి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కార్యాచరణ వెరసి గ్లోబల్ లీడర్‌గా ఏపీ టూరిజం ఎదిగేందుకు క్రమక్రమంగా అడుగులు పడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. ముంబయి పర్యటనలో ఉన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రెండో రోజు బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI) ఎక్స్‌పోలో’ఏరోస్ ఇన్నోవేషన్’ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో ఫలప్రదమైన సమావేశాన్ని నిర్వహించారు.

ప్రపంచ స్థాయి కల్చరల్ ఏఐ ఎకోసిస్టమ్

భారతీయ సంస్కృతి, పురాణాలు, భాషలు, కథా సంప్రదాయాలను లోతుగా అర్థం చేసుకునేలా రూపొందించిన ఏరోస్ ఇన్నోవేషన్ యొక్క ‘లార్జ్ కల్చరల్ మోడల్స్’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోనే మొదటి ‘కల్చరల్ ఏఐ’ పర్యాటక వ్యవస్థను అభివృద్ధి చేసే అంశంపై మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా మన రాష్ట్ర సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అద్భుతమైన డిజిటల్ పర్యాటక అనుభూతులు

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలు, చారిత్రక వారసత్వ కట్టడాలు, గొప్ప సాంస్కృతిక గాథల చుట్టూ పర్యాటకులకు అద్భుతమైన ‘ఇమ్మర్సివ్ డిజిటల్ జర్నీ’ అనుభూతులను అందించడమే ఈ చొరవ ప్రధాన ఉద్దేశ్యం. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా మన చరిత్రను డిజిటల్ మాధ్యమంలో అనుభూతి చెందేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది,” అని పేర్కొన్నారు.

యువతకు ఉపాధి – ‘క్రియేటర్ ఎకానమీ’కి ఊతం

ఈ భాగస్వామ్యం కేవలం పర్యాటకానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని యువ కళాకారులు, కథకులు, డిజైనర్లు, సినీ నిర్మాతలు, డిజిటల్ క్రియేటర్లకు అంతర్జాతీయ వేదికను కల్పిస్తుందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. తద్వారా అభివృద్ధి చెందుతున్న ‘క్రియేటర్ ఎకానమీ’ (సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ), విస్తృతమైన ‘ఆరెంజ్ ఎకానమీ’లో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషించి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

గ్లోబల్ లీడర్‌గా ఆంధ్రప్రదేశ్..ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ వారసత్వం

సాంకేతికత, సంస్కృతి, పర్యాటక రంగాలను అనుసంధానం చేస్తూ కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించే దిశగా ఏరోస్ ఇన్నోవేషన్ మరియు ఏపీ పర్యాటక శాఖ కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఇమ్మర్సివ్ హెరిటేజ్ టూరిజంలో ప్రపంచ అగ్రగామిగా నిలబెడతామని, సృజనాత్మక వ్యవస్థాపకతకు కొత్త మార్గాలను ఈ ప్రాజెక్ట్ సుగమం చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ఏరోస్ యూనివర్స్, ఏరోస్ నౌ సీఈఓ విక్రమ్ తన్నా, ఏరోస్ ఇన్నోవేషన్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పియూష్ భాటియా, ఏరోస్ వెల్నెస్ ఆర్ అండ్ డి సీఈఓ డాక్టర్ శిల్పా దేశాయ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈఓ ఎ. శ్రీనివాస్, ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ సత్యప్రభ, మార్కెటింగ్ మేనేజర్ రఫీక్, సీనియర్ కన్సల్టెంట్ శివ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *