Breaking News

మృతి చెందిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పెన్షన్ లే తొలగించాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-2024-25, 2025-26 ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ లో కేటాయించిన నిధులకు అదనంగా బేవరేజెస్ కార్పొరేషన్ నిధుల నుండి రూ. 11,140.46 కోట్ల ఖర్చు చేసిందన్న మంత్రి
-గత ప్రభుత్వంలో సిక్స్ స్టెప్ వ్యాలీడేష‌న్ పేరుతో 11 లక్షల పెన్షన్లను అన్యాయంగా తొలగించారు.
-గత ప్రభుత్వంలో 14.54 లక్షల మరణాలు,శాశ్వత వలసల కారణంగా పెన్షన్లు తొలగించింది. సగటున నెలకు 24,244 పెన్షన్లు తగ్గాయి.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం మృతి చెందిన,శాశ్వ‌తంగా వ‌ల‌స‌వెళ్లిన పెన్ష‌న్లు మాత్ర‌మే ర‌ద్ద‌య్యాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు.గ‌త వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌తి ఆరు నెల‌ల‌కు సిక్స్ స్టెప్ వ్యాలీడేష‌న్ పేరుతో 5 ఏళ్ల‌లో ఏకంగా 11 ల‌క్ష‌ల‌కు పైగా పెన్ష‌న్లు ర‌ద్దు చేసి పేద‌ల పొట్ట‌గొట్టారని కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.గత ఐదేళ్ల పాల‌న కాలంలో ఇష్టం వ‌చ్చిన‌ట్టు పెన్ష‌న్లు తొల‌గించారని, ఈ ప్రభుత్వం 20 నెల‌ల పాల‌న‌లో అన్యాయంగా ఒక్క పెన్ష‌న్ కూడా తొల‌గించ‌లేదని, పేదలకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి, ప్రతీ నెలా స్పౌస్‌ పెన్షన్ కోటాలో వితంతువులకు పెన్షన్ మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

నెల నెలా స్పౌస్‌ పెన్షన్ లను మంజూరు చేస్తుంటే, ఏ ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదని ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. వారి సొంత టీవీ ఛానెల్స్ లో, పెయిడ్ మీడియాలో 6 లక్షల పెన్షన్ లు తొలగించారు, ఇంకో 7 లక్షల 46 వేల పెన్షన్ లు తొలగిస్తారు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం ACT No 31 of 2021 ప్రకారం బెవరేజెస్ కార్పొరేషన్ నిధుల ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు చట్టం చేశారని, గత ప్రభుత్వం 2021-24 మధ్య కాలంలో బేవరేజెస్ కార్పొరేషన్ నుండి ₹18,472.59 కోట్లు ఖర్చు చేసిందని తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ. 11 వేల 140.46 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు.

బేవరేజెస్ కార్పొరేషన్ వారు ఇచ్చే నిధుల వివరాలు ప్రభుత్వ బడ్జెట్ లో చూపించడం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా సామాజిక భద్రతా పెన్షన్ ల కోసం గానూ, 2026-27 ఆర్ధిక సంవత్సరంలో 27 వేల 719 కోట్ల రూపాయలను బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగిందని, పెన్షన్ లకు కావాల్సిన మరో రూ.5 వేల 766 కోట్ల రూపాయలను పైన పేర్కొన్న యాక్ట్ ప్రకారం(act no 31 అఫ్ 2021) బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయబడుతుందని మంత్రి వివరించారు. పెన్షన్ లకు ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులు రాకుండా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఏ విధమైన రాజకీయ ప్రకటనలను ప్రజలు నమ్మవద్దని ప్రజలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *