-గ్రామాల్లో అభివృద్ది పనుల పై అధికారులతో సమీక్షించిన ..
-ఎమ్మేల్యే …దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే వివిధ గ్రాంట్ లను సకాలంలో ఖర్చుచేసి అభివృద్ధిలో ముందడుగు వెయ్యాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అధికారులుకు సూచించారు. స్థానిక అధికార క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముదినేపల్లి, కలిదిండి మండలాల ఎంపీడీఓలు, ఎంపీపీలు, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ముదినేపల్లి, కలిదిండి మండలాలలో గ్రామాల అభివృద్ధికి మండల పరిషత్ ల సాధారణ నిధులు, 15 వ ఆర్ధిక సంఘ నిధులు వాటికి అవసరమైన చోట్ల ఆయా గ్రామ పంచాయితీల 15 వ ఆర్ధిక సంఘ నిధులు జోడింపు వంటి విషయాలను చర్చించి, ఏ ఏ గ్రామాలకు ఏమి అవసరం వుందో, గతంలో ఇచ్చిన హామీల మేరకు కేటాయింపులు చేస్తూ, తక్షణం అంచనాలు వేసి సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు సకాలంలో గ్రౌండ్ అయ్యేవిధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో కలిదిండి ఎంపిపి చందన ఉమా మహేశ్వరరావు, ముదినేపల్లి ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, కలిదిండి ఎంపీడీఓ పార్థసారథి, ముదినేపల్లి ఇంచార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్ ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ పగడాల సురేష్ బాబు,గ్రామీణ నీటి సరఫరా ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ శాస్త్రి,ఏ.ఈ నాగబాబు, ఏవో గుంజా మాధవరావు పాల్గొన్నారు.