Breaking News

జిల్లాలోని 9 పీహెచ్ సీలకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (NQAS) ధృవీకరణ…

-జాయింట్ కలెక్టరు శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు నాణ్యతా ప్రమాణాలుకు అనుగుణంగా పనిచేస్తున్న వాటిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలను (ఎన్ క్యూఏఎస్) ధృవీకరణను అందించిందని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. నగరంలోని జాయింట్ కలెక్టరు క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా నాణ్యాతా ప్రమాణాల అధికారి డా. చైతన్య జిల్లాలోని 3 ప్రభుత్వ ఆసుపత్రులకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (NQAS) ధృవీకరణ రిజర్టు వచ్చిందని జాయింట్ కలెక్టరు శివశంకరుకు వివరిచారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు ఎల్. శివ శంకర్ మాట్లాడుతూ జిల్లాలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న 48 పీహెచ్ సీలను కేంద్రబృందం పరిశీలించిందన్నారు. ఇందులో జిల్లాకు సంబందించి 9 పీహెచీలకు రిజల్టు ప్రకటించగా ముందుగా 3 పీహెచ్ సీలకు కోడూరు, నాగాయలంక, వీరంకిలాకు పీహెచ్ సీలకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (NQAS) ధృవీకరణను అందించనట్లు మెయిల్ ద్వారా నిర్థారించారన్నారు. గత రెండు మాసాల క్రితం చినఓగిరాల, తాళ్లపాలెం పీహెచ్ సీలకు గుర్తించి జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల బృందం (ఎన్ క్యూఏఎస్) ధృవీకరణ పత్రాలను అందించారన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న జీజీ హెచ్ విజయవాడ, డీహెచ్ మచిలీపట్నం, ఏహెచ్ నూజివీడు ఆస్పత్రుకు కూడ లక్ష్య నేషనల్ ఎస్సూరెన్స్ నాణ్యతా ప్రమాణాల ధృవపత్రాలు అందుకున్నాయన్నారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు మరియు రోగుల సౌకర్యాలను పరిశీలించిన NQAS సర్టిఫికేషన్ బృందం, ఆసుపత్రి పరిశుభ్రత మరియు నాణ్యతా ప్రమాణాల విషయంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాయిలో ఈ ఆసుపత్రులను రేట్ చేసిందని తెలిపారు. నేషనల్ క్యాలిటీ ఎస్సూరెన్స్ స్టాండర్స్, లక్ష్య నేషనల్ ఎస్సూరెన్స్ సర్టిపికేట్స్ పొందిన ఆస్పత్రులకు మూడేళ్ళ పాటు ఏడాదికి రూ. 3 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాణ్యాతా ప్రమాణాల అధికారి డా. చైతన్య, డా. సంధ్య, డా. సిభా ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *