Breaking News

బాలల హక్కులు –పరిరక్షణకు ఎంపిక చేసిన ప్రాజెక్టులోని స్నేహపూరిత గ్రామకమిటీ సభ్యులు బాధ్యతో పనిచేయాలి…

-జాయింట్ కలెక్టరు ఎల్.శివశంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి గ్రామంలో బాలిక, బాలుడి హక్కులు కాపాడడమే గ్రామ స్థాయి బాలల రక్షణ కమిటీ ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) ఎల్.శివశంకర్ అన్నారు. మంగళవారం పెనమలూరు మండలం కానూరు ఉమెన్ వెల్పేర్ ప్రోజెక్ట డైర్టరు కార్యాలయ సమావేశమందిరంలో బాలల హక్కులు, రక్షణ పై ఎంపిక చేసిన స్నేహపూరిత గ్రామాల కమిటీ సభ్యులతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అంశాలపై ఉమెల్ వెల్పేర్ పీడి ఉమారాణితో కలసి సమీక్షించారు. ఈసందర్బంగా జాయింట్ కలెక్టరు శివశంకర్ మాట్లాడుతు జిల్లాలో బాలల హక్కులను సంరక్షించేందుకు జిల్లాలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ద్వారా ఒక్కోక్క గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో గ్రామ స్థాయి కమిటీలు సమావేశాలు నిర్వహిస్తూ బాలల ఆరోగ్యం, పౌష్టికాహారం, సురక్షితమైన తాగునీరు, మంచి వాతావరణం, వివక్షత, లైంగిక, శారీరక మానసిక దోపిడీ మరియు వేధింపులకు గురికాకుండా జీవించేలా ఈ కమిటీలు సేవలందించాలన్నారు. ఐసిడియస్ వ్యవస్థను బలోపేతం చేసి పిల్లలు, గర్భవతులు, బాలింతల పోషణస్తితిని మెరుగు పరచుట కొరకు పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ వారి సూచనలతో రూపొందించిన యాప్ లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గర్భవతుల, బాలింతల, పిల్లలు వివరాలు నమోదు చేయాలన్నారు. బాల సదనాలు ద్వారా అనాధ, పాక్షిక అనాధ , దారిద్య రేఖకు దిగువన గల కుటుంబాలలోని బాలికలకు ఉచిత ఆవాసం మరియు విద్య అందించుట కొరకు ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా జిల్లాలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి కమిటీలను నియమించామన్నారు. బాలల స్నేహపూరిత గ్రామాలు తీర్చి దిద్దేందుకు ఈ కమిటీలు బాద్యతా యుతంగా పనిచేయాలన్నారు. నవంబరు 14 వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టరు(అభివృద్ది) శివ శంకర్ తెలిపారు. బాల్య దశలో అన్ని విద్య నుంచి ప్రతీదీ నేర్చుకోవాలి కనుక ఆదిశగా స్నేహపూరిత వాతావరణంలో అవరోధాలు లేకుండా బాలలహక్కులను కాపాడేందుకే చైల్డ్ ప్రెండ్లీ గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. బాలలు వివక్ష, దోపిడీ మరియు వేధింపులక నుంచి రక్షణపొంది వారి సంపూర్ణ హక్కలను ఆహారం, విద్య ఆరోగ్యం, గౌరవం ఆటాపాటా,ఉల్లాసం పొందగలుతారో అటువంటి వార్డులను గ్రామాలను బాలల స్నేహపూరిత గ్రామాలంటారన్నారు. ఈ మేరకు కమిటీ సభ్యులు తమ వంతు బాధ్యతను నిర్వహించాలన్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమశా పీడీ ఉమారాణి,ఏపీడీ జయలక్ష్మి, క్రాఫ్ డైరెక్టరు ప్రాన్సిస్, జిల్లాలోని సీడీపీవోలు,అంగన్ వాడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *