అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో లో నెహ్రూ యువ కేంద్ర కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు బి జే ప్రసన్న డా. బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రసన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 న మన దేశానికీ స్వాతంత్రము వచ్చిన తర్వాత , రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అనేక సవరణల అనంతరము 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్నిడాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది అని తెలిపారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో మరో అతిధి సి డబ్లు సి చైర్మన్ బి సుజ్ఞాన రాణీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు అని నాటినుండి భారతదేశము ” సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందింది అని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగాన్ని గౌరవించాలి అని అన్నారు. ఈ సందర్భముగా భారత రాజ్యాంగ ప్రవేశికను ఈ కార్యక్రమములో హాజరైన అందరు తో ముఖ్య అతిధి చదివించారు. ఈ కార్యక్రమం లో నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి, నెహ్రూ యువ కేంద్ర సంఘటన కార్యాలయ సిబ్బంది బి వినయ్ కుమార్ , సి ఎచ్ సుమంత్ , జె కె సి కళాశాల విద్యార్థులు మరియు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …