విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐకమత్యానికి గ్యార్మీ పండుగ నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రిక బర్మా కాలనీ దర్గా వద్ద గ్యార్మీ పండుగ వేడుకలు కోలాహలంగా జరిగాయి. జెండా పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి శాసనసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మత సామరస్యం పెంపొదించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి ఏటా గ్యార్మీ పండుగను ముస్లిం సోదరులు ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గంలో నడుచుకోవాలని, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలన్నారు. అనంతరం జెండా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ, నాయకులు యర్రగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, బోరా బుజ్జి, అక్కిశెట్టి నారాయణ, రఫీ, ఇస్మాయిల్, అనిల్, కోటి, మేడా రమేష్, ఎస్. కే. బాషా, బాబ్జి, తాండవ కోటి, యోహాను, కంఠ రామాంజనేయులు, నాగిరెడ్డి, రామిరెడ్డి, పెద్ద ఎత్తున ముస్లింలు సోదరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …