-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ ను సద్వినియోగం లబ్దిదారులకు అధికారులు అవగాహన కల్పించాలి..
-థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున వ్యాక్సన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి.
-ఆర్డీవో శ్రీనుకుమార్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు వివిధ సమస్యలపై స్పందన లో ఇచ్చిన ప్రతి అర్జీనీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోపే పరిష్కరిం సత్వర న్యాయాన్ని ధరఖాస్తు దారులకు అందించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు.
స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వన్ టైమ్ సెటిల్ మెంట్ పై అధికారులు లబ్దిదారులకు అవగహాన కల్పించాలి..:- రాష్ట్ర ప్రభుత్వం 1983 నుంచి మంజూరు చేసిన ఇళ్లస్థలాల్లో ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం గృహనిర్మాణ సంస్థ ద్వారా అప్పుతీసుకొని తీర్చని వారి రుణాలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆర్డీవో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొన్నారని, అందులో కొంత మంది స్వంతగా ఇళ్లు నిర్మించుకోగా మరి కొందరు గృహనిర్మాణ సంస్థ లో వారికి అలాట్ చేసిన పట్టాను తాకట్టు పెట్టి రుణం పొందారన్నారు. వీరందరికీ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ కోరారు. ఈ పథకం కింద ఇంటిపై అప్పు తీసుకున్న లబ్ధిదారుడు లేదా వారసుడు గ్రామీణ ప్రాంతమైతే రూ.10వేలు, పురపాలకసంఘాల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ.20 వేలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించవలసి సంబందిత సచివాలయాల్లో చెల్లించాలన్నారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలో సుమారు 4 వేలకు పైగా పంచాయితీ సెక్రటరీలు లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ ద్వారా అప్రూవల్ చేసారన్నారు. కావున లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవడం ద్వారా గృహనిర్మాణ సంస్థలో ఉన్న అప్పులు రద్దుకాగా వారి ఇంటికి పక్కా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు శాశ్విత హక్కును కల్పించడం జరగుతుందని ఆర్డీవో తెలిపారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి. :-
కోవిడ్ థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు.. కోవిడ్ కట్టడే లక్ష్యంగా షాఫులు, వాహనాలు, వ్యాపార వాణిజ్య సంస్థంలో “నో మాస్క్ నో ఎంట్రీ”, “నోమాస్క్ నో రైడింగ్”, “నోమాస్క్ నో సేల్” బోర్డులను ప్రదర్శిస్తూ వినియోగదారులుకు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్ పోయిందని ఎవరూ భావించవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నరు.
అర్జీలు :- గుడివాడ పట్టణం శ్రీ కాలహస్తి కాలనీ కు చెందిన పి. విజయ తమ అర్జీలో తన భర్త మరణించాడని తనకు ఎటువంటి ఆదారము లేదని రెండేళ్ల క్రిందట రేషన్ కార్డు పోయిందని అప్పటి నుంచి రేషన్ బియ్యం రాక చాలా ఇబ్బందులు పడుతున్నానని కావున రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ దాఖలు చేశారు.
ముదినేపల్లి మండలం లోని 32 గ్రామాల్లో ఈ పంచాయితీ అప్లికేషన్ అప్టేట్ చేయటకు రిసోర్సు పర్సన్ ను కార్వే డేటా మెనేజ్మేంట్ ప్రేవేట్ లిమిటెడ్ సంస్థ జనాభా ప్రాతి పధికన ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ను తీసుకుందని, వీరి జీతముల విషయములో నిబంధనలు పాటించకుండా ఈవో పిఆర్ అండ్ ఆర్డీ వారు 14 వ ఆర్ధిక సంఘ నిధుల నుంచి జమ చేయమన్నారు. కావున ఈ అంశంపై విచారణ చేయవలసిందిగా ఏ. రామాంజనేయులు బొమ్మినంపాడు వారు తమ అర్జీలో కోరారు.
మండవల్లి మండలం శింగనపూడి గ్రామంలో 159,160,161/2 సర్వే నెంబర్ల లో గల 15.59 ఎకరముల భూమిని కైకలూరు నివాసి కృష్ణప్రసాద్ ఆక్రమణ చేసుకున్నారని, కావున మా భూమిని మాకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ కె. జగదీష్, వి. సుధీర్ కుమార్, పి.దావీదు తదితరులు తమ అర్జీలో కోరారు.
కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, డీటీ బాలాజీ, డిఎల్పీవో నాగిరెడ్డి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, ఆర్ డబ్ల్యూఎస్.ఈఈ లీలా కృష్ణ, డ్రైనేజీ ఏఈ ప్రసాద్, ఆర్ అండ్ బీ కార్యాలపు సీ.అ. మహేష్, కోపరేటివ్ కార్యాలపు జూ.అ.సి.గోవీనాధ్, ఐసీడిఎస్ సూపర్ వైజర్ బేబీ సరోజిని తదితరులు హాజరయ్యారు.