Breaking News

“ఉపాధి కల్పన మరియు వ్యవస్థాప అభివృద్ధి సంస్థ”ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి 13 జిల్లాల పరిధిలో 137 కార్పొరేషన్లు రూపొందించిన వాటిల్లో అతి ముఖ్యమైన కార్పొరేషన్ “ఉపాధి కల్పన మరియు వ్యవస్థాప అభివృద్ధి సంస్థ”ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని నూతన చైర్మన్ సాది శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఆర్.టి.సి. పరిపాలనా భవనం లోని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాప అభివృద్ధి సంస్థ చైర్మన్ గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి నాపై ఉన్న నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించి నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంస్థకు నన్ను ఎంపిక చేయడంలో పార్లమెంట్ సభ్యులు విజయ సాయి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.
పారిశ్రామిక రంగంలో పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని భారత దేశంతో పాటు విదేశాల స్థాయిలో నేను నిర్వహించిన పరిశోధనలను పరిగణనలోనికి తీసుకుని ఉపాధి కల్పనలో రాణించ కలిగిన ఆసక్తితో విధి నిర్వహణ ఉంటుందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా మా సంస్థలకు ఇచ్చిన లక్ష్యాలను శత శాతం పూర్తి చేసి సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా నిర్వహణ ఉంటుందని చైర్మన్ తెలిపారు. నాకు ఉన్న నైపుణ్యాన్ని వ్యాపార దృక్పధంతో మరిన్ని క్రొత్త కోణాలను ఆవిష్కరిస్తూ అందులోని భాగంగా మా సంస్థ లక్ష్యం గ్రామీణ యువతను ఎంపిక చేయడంలో మా ప్రధమ ప్రయత్నంగా ఉండ బోతోందని చైర్మన్ తెలిపారు. యువతకు శిక్షణా విధానంలో నూతన ఒరవడితో నిత్య నూతనంగా రూపొందించనున్నట్లు చెప్పారు. మా సంస్థ సరిక్రొత్త ముందస్తు ప్రణాళికతో పారిశ్రామిక మరియు మార్కెట్ రంగాలకు అనుగుణంగా ఉత్పత్తి సాధించి వృద్ధి రేట్ ను మరింత మెరుగుగా నిర్వహణ ఉండ బోతోందని చైర్మన్ తెలిపారు. ఇందుకు గాను మా సంస్థ సిబ్బంది సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
జిల్లాల స్థాయిలో నేటి నుండి మార్కెట్ అవసరాలకు తగిన విధంగా విధి విధానాలు రూపొందించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపుకు కృషి చేసేందుకు మా సంస్థ బృంద సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య కేవలం ఆర్ధిక పరమైన ఆలోచన గానే పరిగణించాలన్నారు. పారితోషికం అధికంగా ఉన్న ప్రాంతాలకు తరలి వెళ్లడం నైపుణ్యత కలిగిన ఉద్యోగులకు ఇది సహజం. అంతేగాని శ్రీకాకుళం వలసలను రాజకీయ కోణంలో వక్రీకరించడం సమంజసం కానే కాదని చైర్మన్ అన్నారు. ఎక్కువ పారితోషికం చెల్లించే ప్రాంతాలకు తరలి వెళ్లడం సర్వ సాధారణంగా భావించాలని వాటిని నిరుద్యోగ వలసలుగా వక్రీకరించ వద్దని హితవు పలికారు.
ఈ సమావేశంలో ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం. మహేశ్వర రెడ్డి, “ఉపాధి కల్పన మరియు వ్యవస్థాప అభివృద్ధి సంస్థ” సిబ్బంది, పలు జిల్లాలకు చెందిన అధికారులు, నూతన చైర్మన్ ను సన్మానించారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *