మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ విరమణ వత్తికే కాని వ్యక్తికి కాదని, రిటైర్మెంట్ ముగింపుగా భావించవద్దని జీవితంలోని కొత్త అధ్యాయాన్ని తెరిచే ఏదో ప్రారంభంలో ఉన్నట్లు చూడాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.
స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలలో 36 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ గా వృత్తిలో పనిచేసి మంగళవారం ఉద్యోగ విరమణ చేస్తున్న భూపతి విజయేసు,కమల కుమారి దంపతుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బలజేసు అన్న విధి నిర్వహణలో ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఎప్పుడూ నవ్వుతూనే పనిచేస్తూ కనబడేవారన్నారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సహజమేనని చెప్పారు. ఉద్యోగంలో చేరిన రోజే రిటైర్మెంట్ తేదీ కూడా ఖరారై ఉంటుందని ఐతే , మనసు దాన్ని అంత తేలిగ్గా అంగీకరించదన్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే భవిష్యత్తు జీవితంపై దృష్టి సారించి దానికి తగ్గట్టు పొదుపు, ఇనె్వస్ట్మెంట్ అనేది అనివార్యం అన్నారు. పిల్లల చదువులు, సొంత ఇళ్లు, రిటైర్మెంట్ తరువాత జీవితంపై ముందు నుంచే ఒక అవగాహనతో ఉంటారు. ఐతే ఉద్యోగంలో చేరిన కొత్తలో చాలామంది దీనిపై అంతగా దృష్టి సారించరన్నారు. క్రమంగా వయసు పెరుగుతున్నా కొద్ది దీనిపై దృష్టి పెంచుతారన్నారు.ఉద్యోగంలో చేరినప్పుడే రిటైర్మెంట్ అనేది ఉంటుందని గ్రహించి మసలుకోవాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్ సి ఎం స్కూల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రెవరెండ్ ఫాదర్ గుజ్జుల మైఖేల్, డివైఈఓ యు.వి. సుబ్బారావు, ఎంఇ ఓ ప్రసాద్, ఐక్య ఉపాధ్యాయ సంఘ పట్టణ గౌరవ అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు తోట రఘుకాంత్ ( చిన్నా ) పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సిబ్బంది, పలు డివిజన్ల కార్పొరేటర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొని విజయేసు దంపతులను ఘనంగా సన్మానించారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …