అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల పిఆర్సి,ఇతర అంశాలకు సంబంధించి అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో శుక్రవారం కార్యదర్శుల స్థాయి కన్సల్టేషన్ కమిటీ-ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఉద్యోగుల పిఆర్సి,ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించి ఉద్యోగ సంఘాల నుండి పలు సూచనలు,సలహాలను తీసుకున్నారు.
ఈకార్యదర్శుల స్థాయి కన్సల్టేషన్ కమిటీ-జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,ముఖ్య కార్యదర్శి(సర్వీసెస్ మరియు హెచ్ఆర్ ఎం)జిఏడి శశిభూషణ్ కుమార్,ఆర్ధిక శాఖ ఇఓ కార్యదర్శి డా.కెవివి.సత్యనారాయణ,అలాగే ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అదే విధంగా ఈసమావేశంలో ఎపి ఎన్జీవో,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం,స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఎపి,ఎపి టీచర్స్ ఫెడరేషన్,ఎపి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్,ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,ఎపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్,ఎపి ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్,ఎపి కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్,ఎపి కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్,ఎపి లైవ్ స్టాక్ సర్వీస్ అసోసియేషన్,ఎపి స్టేట్ టైపిస్ట్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు,జనరల్ సెక్రటరీలు వరుసగా బండి శ్రీనివాసరావు,కె.శివారెడ్డి,వెంకట్రామిరెడ్డి, ఎన్.ప్రసాద్,సిహెచ్.జోసెఫ్ సుధీర్ బాబు,ఎం.రఘనాధ్ రెడ్డి,హృదయ రాజు,కె.కులశేఖర,ఎన్. వెంకటేశ్వర్లు,కె.ఎస్ఎస్. ప్రసాద్,బొప్పరాజు వెంకటేశ్వర్లు,సిహెచ్.కృష్ణమూర్తి,కె.ఆర్.సూర్య నారాయణ,జె.ఆస్కార్ రావు, జి.రవికుమార్,డి.రమణా రెడ్డి,టివి.ఫణిపేర్రాజు,కె.భావన రుషి,కెఆర్.సూర్యనారాయణ, జిఎం.రమేశ్,ఎల్.సూర్యనారాయణ,కె.రామకృష్ణ,జి.మోహన్ గోపాల కృష్ణ,బిసి శంకరనాయక్, ఎపి సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు బి.లక్ష్మీనారాయణ,నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం తరుపున గోపాల కృష్ణ,మరో ఉద్యోగుల సంఘం తరపున శోభన్ బాబు తదితరులు పిఆర్సి,ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన వివిధ అంశాలను కార్యదర్శుల స్థాయి కన్సల్టేషన్ కమిటీ సమావేశం దృష్టికి తెచ్చారు.
Tags amaravathi
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …