అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు గా నియమింపబడిన జస్టిస్ డా.కుంభాజడల మన్మధరావు,జస్టిస్ కుమారి బొడ్డుపల్లి శ్రీ భానుమతిలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు.ఈమేరకు బుధవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇద్దరు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరాం,హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ ఎ.రవీంద్ర బాబు,ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు,ఎపి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకీరామి రెడ్డి,అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాధ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస రెడ్డి,ఇంకా పలువురు రిజిష్ట్రార్లు,న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …