Breaking News

దివ్యాంగులకు రూ.2.96 లక్షల ఖరీదైన ట్రై సైకిల్స్ పంపిణీ

-పెనుగొండ మండలం లో ఎనిమిది మందికి అందుచేత…
-మంత్రి శ్రీరంగనాధరాజు

పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలన్నా చాలా కష్టపడే వారని, వారికి చేదోడు గా సహాయకారిగా ఉండేందుకు ఉచితం గా బ్యాటరీ మూడు చక్రాల సైకిల్స్ అందచేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం లో ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలానికి చెందిన ఎనిమిది మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ, ఇటువంటి ట్రై సైకిల్స్ ఉచితంగా అందచేయ్యడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంచడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. దివ్యాంగులకు భగవంతుడు ఏదో ఒక విద్యలో నైపుణ్యత ఇచ్చి ఉంటాడని వాటిని కనుగొని వాటికనుగుణంగా జీవనం సాగించాలని మంత్రి అన్నారు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా దివ్యాంగులు సులభంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకో గలుగుతున్నారని తెలిపారు. కాలానుగుణంగా ప్రస్తుత కాలంలో బ్యాటరీ మూడు చక్రాల సైకిల్ అందచేస్తున్న ట్లు పేర్కొన్నారు. యూనిట్ ఖరీదు రూ.37 వేలు చొప్పున ఎనిమిది బ్యాటరీ ట్రై సైకిల్స్ కోసం రూ.2 లక్షల 96 వేలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అందించడం జరిగిందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, వెనుకబడిన వర్గాల, నిరుపేద కుటుంబాలతో పాటు దివ్యాంగులకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు నాడు-నేడు కార్యక్రమం, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద వంటి ఎన్నో పథకాలు అందుబాటులోకి తెచ్చిందని శ్రీరంగనాధరాజు తెలిపారు. నిరుపేదల పిల్లలు కూడా ఉన్నత విద్య నభ్యసించుటకు కూడా చేయూతను ఇస్తుందన్నారు. మన ప్రభుత్వం అభివృద్ధి పనులు తో పాటు సంక్షేమానికి నిదర్శనం ఇటువంటి కార్యక్రమాలనేనని ఆయన తెలిపారు. పెనుగొండ మండలం లోని 8 మంది దివ్యాంగులు ఏ. సాయిబాబు, బి.శ్రీనివాసరావు, సిహేచ్. తాతారావు, సీహెచ్. పుష్పకుమారి, కె. ఫిలిప్, కె. రాజేశ్వరి, ఎమ్. సుగుణ రావు లకు మంత్రి చేతులమీదుగా బ్యాటరీ ట్రై సైకిల్స్ అందచేశారు. మన ప్రాంతంలోని దివ్యాంగులు ఎవరికైనా సైకిలు రాకపోయినా అర్హత కలిగిన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పిటిసి పోడూరి గోవర్ధన్, ఎంపిపి పోతినీడు వెంకటేశ్వరరావు, ఏఎంసి ఛైర్మన్ జి. చిట్టిరత్నం, ఏవో బి.శ్రీనివాస్, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్దిదారుల కుటుంబ సభ్యులు, తదితరులు హాజరయ్యారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *