Breaking News

కొండప్రాంత వాసుల మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్, బందులదొడ్డి సెంటర్ మరియు ఆర్.సి.ఎమ్ చర్చ్ ప్రాంతాలలో పర్యటించి స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ ఆధ్వర్యంలో దాదాపు 55 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించబోయే మెయిన్ వాటర్ పైప్ లైన్ మరియు సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేసారు. అవినాష్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు,డ్రైన్ నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చిన, అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. మరలా ఇప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వం లో 6వ డివిజన్ లో దాదాపు 2కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేపించి నూతన మెట్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు, మంచినీటి సమస్య పరిష్కారానికి చేపట్టినట్టు తెలిపారు. మా పాలన మీద నమ్మకంతోనే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అమర్నాద్ ని గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనేవిధంగా పని చేస్తామని భరోసా ఇచ్చారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ గారిదే అని, ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ఇలాంటి షో రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరక్టర్ ఇజ్జాడ తేజేష్, వైస్సార్సీపీ నాయకులు ప్రభు, బాలస్వామి, నత్తా ప్రవీణ్, కోటేశ్వరరావు, అబ్బూరి చిన్న, మాలాద్రి, దుర్గ, బుడ్డి, హుస్సేన్ మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *