Breaking News

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ప్రారంభించామని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు వెల్లడించారు. శనివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ రెడ్డి అసోసియేషన్ చారిటబుల్, యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును కలెక్టర్ తో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు డా.సంజీవ్ కుమార్ నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్ లు ప్రారంభించారు.

కరోనా వైరస్ మూడవ దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రోగులకు నాణ్యమైన వైద్యంతో పాటు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఎంతో ఉపకరిస్తుందని కలెక్టర్ తెలిపారు. నిమిషానికి 87 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అత్యవసర సమయాల్లో రోగులకు ప్రాణవాయువును అందించచవచ్చన్నారు. జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులో వుంచామన్నారు.

కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ రెడ్డీస్ చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్ చేసిన ఆక్సిజన్ ప్లాంట్ రోజుకు 20 సిలిండర్ల ప్రాణ వాయువును ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కేంద్ర ప్రభుత్వం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు మొత్తం 4 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఈ ప్లాంటు అన్నీ కలిపి రోజుకు 600 నుంచి 700 సిలిండర్ల ఆక్సిజన్ ను తయారు చేసుకోవచ్చన్నారు. కోవిడ్ లేని సమయంలో హాస్పిటల్ కు 200 సిలిండర్లు సరిపోతాయని… బయటినుండి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఈ ఆక్సిజన్ ప్లాంట్లు రోగులకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయని తెలిపారు.

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ రెడ్డి అసోసియేషన్ చారిటబుల్ ట్రస్ట్, యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపేద రోగులకు ఇబ్బంది లేకుండా వుంటుందన్నారు. గతంలో ఆక్సిజన్ కొరత వల్ల చాలామంది కరోనా బారిన పడిన రోగులు మరణించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ లు స్థాపిస్తున్నారన్నారు.

నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డా. సుధాకర్ లు మాట్లాడుతూ కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చుచేసి మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. ప్రభుత్వానికి తోడుగా వివిధ చారిటబుల్ ట్రస్ట్ దాతలు కూడా ముందుకొచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఎన్ఆర్ఐ చారిటబుల్ ట్రస్ట్ మన దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలన్న తపన వుందని వారు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.జి. నరేంద్రనాథరెడ్డి, సి ఎస్ ఆర్ ఎంఓ డా. హేమనలిని, ఆర్ ఎం ఓ డాక్టర్ వసుధ, ఈఎన్టి స్పెషలిస్ట్ డా.మహేంద్ర కుమార్, డా.వెంకట రమణ, డా.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *