Breaking News

ఏపీ గృహ నిర్మాణ పథకం పై జర్మనీ ఆర్థిక సంస్థ ఆసక్తి

-జగనన్న కాలనీల విద్యుత్ మౌలిక సదుపాయలకు ఆర్థిక సహకారం అందించే అవకాశాన్ని పరిశీలిస్తామని జర్మన్ సంస్థ కె ఎఫ్ డబ్ల్యు హామీ
-ఇంధన సామర్ధ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ నిమిత్తం 150 మిలియన్ యూరోలు అందచేసే అవకాశం– కె ఎఫ్ డబ్ల్యు
-సాంకేతిక సహకారం నిమిత్తం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశం
-విద్యుత్ పంపిణి మౌలిక సదుపాయాలు , విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం
-గృహ నిర్మాణ పథకంలో ఇంధన సామర్ధ్య అమలుకు ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం
-పేదలు సురక్షితంగా, సౌకర్యంగా హుందాగా జీవించేలా గృహ నిర్మాణం.. ఇదే ముఖ్యమంత్రి లక్ష్యం — గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , అజయ్ జైన్
-జగనన్న కాలనీలలో విద్యుత్ పంపిణి మౌలిక సదుపాయాలు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించండి.. కె ఎఫ్ డబ్ల్యు ని కోరిన అజయ్ జైన్
-ఇంధన సామర్థ్య గృహ నిర్మాణం పై శిక్షణ , బెస్ట్ ప్రాక్టీసెస్ పై సమాచారం అందచేసేందుకు సహకరించండి
-ఇంధన సామర్థ్యం ద్వారా 2 నుంచి 4 డిగ్రీ వరకు ఇంటి లోపల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తుంది. “నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు” పథకం లో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లలో ఇంధన సామర్ధ్య ప్రమాణాలు అమలు చేసేందుకు ఆర్థిక సహకారాన్ని అందించడం పై జర్మనీ కి చెందిన అంతర్జాతీయ బ్యాంకు కే ఎఫ్ డబ్ల్యు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.
జగనన్న కాలనీలలో నిర్మించే ఇళ్లకు సంబంధించి ఇంధన సామర్ధ్య డిజైన్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అలాగే ఇంధన సామర్ధ్య విద్యుత్ ఉపకరణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయ నిమిత్తం అంతర్జాతీయ సహకారాన్ని గృహ నిర్మాణ శాఖ కోరుతుంది. ఈ నేపథ్యంలో జర్మనీ కి చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు కె ఎఫ్ డబ్ల్యు అధికారులు , రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు.
గృహ నిర్మాణ పథకానికి సంబంధించి వివిధ అంశాల పై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కె ఎఫ్ డబ్ల్యు ఎనర్జీ ఎఫిసిఎన్సీ విభాగం అధిపతి మార్టిన్ లక్స్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం లో నిర్మించే ఇళ్లలో ఇంధన సామర్ధ్య ప్రమాణాల అమలుకు సంబంధించి ప్రాజెక్ట్ తయారీ , అధ్యయనం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు పై అధ్యయనం అనంతరం ఇంధన సామర్ధ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ నిమిత్తం 150 మిలియన్ యూరోలు , సాంకేతిక సహకారం నిమిత్తం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం అన్నారు. అంతే గాక జగనన్న కాలనీలలో విద్యుత్ పంపిణి మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతం తదితర మైన వాటికీ కూడా ఆర్థిక సహకారం అందచేసే ప్రతిపాదనను పరిశీలిస్తాం అన్నారు. పేదలకు నిర్మించే ఇళ్లలో అత్యుత్తమ ఇంధన ప్రమాణాలు అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని తాము అభినందిస్తునట్లు కె ఎఫ్ డబ్ల్యు అధికారులు తెలిపారు.
పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్ధ్య డిజైన్లతో ఇళ్ల నిర్మాణం చేసుకునేవారికి ఏపీ పథకం అత్యుత్తమ నమూనాగా నిలుస్తుందని తెలిపారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు హుందాగా , సౌకర్యవంతంగా జీవించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృష్ణిని ఆయన అబినందించారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ పథకంలో సహకరించేందుకు ముందుకు వచ్చిన కే ఎఫ్ డబ్ల్యు కు ధన్యవాదములు తెలిపారు. కే ఎఫ్ డబ్ల్యు చేస్తున్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతం అని తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా ఇప్పటికే 10.72 లక్షల ఇల్ల నిర్మాణం ప్రారంభమయ్యాయన్నారు.
రాష్ట్రంలో ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం నెరవేర్చేందుకు గృహ నిర్మాణ శాఖ కృషి చేస్తుందన్నారు. పేదలకు కేవలం తల దాచుకునే చోటు కల్పించడం ఒకటే ప్రభుత్వ లక్ష్యం కాదనన్నారు. లబ్ధిదారులు సౌకర్యవంతమైన ఇళ్లలో సురక్షితంగా , గౌరవంగా జీవించే విధంగా అన్ని మౌళిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు .
పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అలాగే సదరు ఇళ్లలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయటం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గి లబ్ధిదారులు దీర్ఘకాలంలో ప్రయాజనం పొందాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు ఆకాంక్షిస్తున్నట్లు అజయ్ జైన్ తెలిపారు.
నూతనంగా నిర్మించే 28.3 లక్షల ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బీ ఈ ఈ , ఈ ఈ ఎస్ ఎల్ సహకారంతో ఒక్కో ఇంటికి 4 ఎల్ ఈ డీ బల్బులు , 2 ఎల్ ఈ డీ ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు పంపిణి చేయనున్నట్లు ఆయన తెలిపారు. జగనన్న కాలనీలలో ఎల్ ఈ డీ స్ట్రీట్ లైట్లు , త్రాగు నీటి అవసరానికి నిమిత్తం ఇంధన సామర్థ్యం తో కూడిన పంప్ సెట్లు అమరుస్తామన్నారు . తద్వారా ఆయా కాలనిలో ఇంధన సామర్ధ్యానికి నిలయాలు గా ఉంటాయని పర్యావరణ పరిరక్షణ కు దోహద పడుతుందని, విద్యుత్ బిల్లులు తగ్గడం వల్ల లబ్దిదారులకు ప్రయోజన కరంగా ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాన్ని అధ్యయనం చేసి దానిలో ఇంధన సామర్ధ్య డిజైన్ల అమలు, ఇంధన సామర్ధ్య ఉపకరణాల పంపిణి , తదితర కార్యక్రమాలకు ఆర్థికం సహాకారం అందించవల్సిందిగా కె ఎఫ్ డబ్ల్యును అజయ్ జైన్ కోరారు . అలాగే ఇంధన సామర్ధ్యానికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలకు సంబందించిన సమాచారాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ తో పంచుకోవడం , అధికారులకు శిక్షణ ఇవ్వడం , లబ్ధిదారులతో ఎనర్జీ ఎఫిషియెన్సీ పై తగిన అవగాహనా సాధించే కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరారు. ఈ ఇంధన సామర్ధ్య ప్రమాణాల అమలు వల్ల ఆయా వాతావరణ పరిస్థితిని బట్టి ఇంటి లోపల ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని తెలిపారు.
ఇంధన శాఖతో సమన్వయంతో గృహనిర్మాణ శాఖ, లబ్ధిదారులకు అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన (మార్కెట్ ధరల కంటే తక్కువ) ఎలక్ట్రికల్ ఉపకరణాలను అందించడానికి ఒక ప్లాట్‌ఫారమ్‌ను సులభతరం చేయాలని యోచిస్తోంది.
జగనన్న కాలనీలలో ఉత్తమ మౌలిక సదుపాయాలు కలగచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ 37000 కోట్లు వ్యయం చేస్తున్నట్లు అజయ్ జైన్ తెలిపారు .విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు సవివర ప్రాజెక్ట్ నివేదిక ( డీ పీ ఆర్) కె ఎఫ్ డబ్ల్యు కు వారం రోజుల్లో సమర్పిస్తామని ఆయన తెలిపారు.
ఏపీఎస్ఈసిఎం సీనియర్ అధికారులు, కే ఎఫ్ డబ్ల్యు సీనియర్ సెక్టార్ స్పెషలిస్ట్, హేమంత్ భట్నాగర్, కే ఎఫ్ డబ్ల్యు అధికారులు అలెక్స్ హ్యూయర్, కిరణ్, రుక్మిణి పార్థసారథి, సంగీత అగర్వాల్ మరియు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *