-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు మూడు రోజుల పాటు దీన దయాళ్ అంత్యోదయ యోజన మరియు స్వచ్చ భారత్ మిషన్ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ పై శిక్షణ కార్యక్రమమును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ దీన దయాళ్ అంత్యోదయ యోజన మరియు స్వచ్చ భారత్ యొక్క సంయుక్త కార్యక్రమం ముఖ్యంగా మెప్మా గ్రూప్ సభ్యుల జీవన శైలి ని మెరుగు పరుచుటకు ఈ కార్యక్రమము ఉద్దేశించినదని, గ్రూప్ సభ్యులకి జీవనోపాధి మార్గాలు పెరగటమే కాక, నగరపాలక సంస్థ నందు పారిశుద్ధ్యం మెరుగు పడుటకు అవకాశం ఉంటుందని అన్నారు.
శిక్షణ ఇచ్చుట ద్వారా బలహీన వర్గాలయిన పారిశుద్ధ్య వృత్తి కి చెందిని వారు, దివ్యంగులు, ట్రాన్స్ జన్డర్, రిక్షా కార్మికులు మరియు నిర్మాణ రంగములోని పని చేసుకోను వారిని గుర్తించి, వారిని మెప్మా గ్రూప్ గా చేయుట మాత్రమే కాకుండా, వారికి వివిద పారిశుద్ధ్యమునకు సంబంధించిన జీవనోపాదులలో శిక్షణ కల్పించి, వారి సామాజిక స్థాయిని పెంపొందించుటయే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బందిలో అవగాహనా కల్పించుట వల్ల పారిశుద్ధ్యం మెరుగు పడుతుంది, ప్రతి ఒక్కరు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొని రాబోవు రోజులలో మన నగరం ప్రధమ స్థానములో నిలిపేందుకు ప్రతి ఒక్కరం సమష్టిగా కృషి చేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు.
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్ ఆఫీసర్) యు.శారద దేవి పర్యవేక్షణలో ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) టి.సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ మరియు Kum Sreya coordinator ig Urban management centre , Alhabad పరోక్షంగా మరియు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కల్పించారు.