Breaking News

నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు డివిజన్ లో జనవరి 20 వ తేదీన కోవిడ్ కేసుల వివరాలు: మొత్తం కేసులు 71 నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా కోవిడ్ కేసుల వివరాలు: గన్నవరం 35, ఉంగుటూరు 11, పమిడిముక్కల 3, బాపులపాడు 1, తిరువూరు 5, నూజివీడు అర్బన్ 1 , నూజివీడు రూరల్ 5, ముసునూరు మండలంలో ఐదు కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరం లేకుండా బయటకు రావద్దని, కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వంతో సహకరించాలని ఆర్డీఓ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *