ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరీ ఆవిష్కరణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవాడి సొంత ఇంటి కల నిజం చేసే మహాయజ్ఞంలోగృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు భాగస్వామ్యులు కావడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గురువారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ఎగ్జిక్యూటివ్ డైరీ- 2022 ను జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా గృహాలు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించి వారి కలను నెరవేర్చే మహోన్నత కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఉద్యోగస్తులు ప్రధాన భూమిక పోషిస్తూ భాగస్వాములు కావడం అదృష్టంగా భావించాలని అన్నారు. నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు కల్పిస్థున్న మిమ్ములను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, ఆశాఖ ఏఇలు, ఈఈ, డిఇలు ఉన్నారు.

Check Also

డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా రోడ్ల నిర్మాణం

-నిధుల కొరత ఉన్నా అడవి బిడ్డలకు అండగా నిలుస్తున్నాం -గత ప్రభుత్వం ఏజెన్సీలో అభివృద్ధికి ప్రాధాన్యమివ్వలేదు -ఎయిడెడ్ స్కూళ్లు తాకట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *