Breaking News

వివిధ పథకాల ద్వారా ముస్లింలకు రూ.3,160 కోట్ల లబ్ధి…

-నూతన డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ ఆసీఫ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, సంక్షేమ పథకాల రధసారథిగా నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ ఆసీఫ్ తెలిపారు. క్రొత్తగా నియమితులైన మోగల్ మహ్మద్ గౌస్ బేగ్ (అనంతపురం జిల్లా అశోక్ నగర్). వి.ఎం. మహీన్ (చిత్తూరు జిల్లా పుత్తూరు), శ్రీమతి షేక్ నిలోఫర్ (ప్రకాశం జిల్లా కంచిపల్లి), మహ్మద్ నాసిర్ ( విజయనగరం), శ్రీమతి మెహరున్నీసా బేగం (పశ్చిమ గోదావరి జిల్లా తణుకు) ఐదుగురు డైరెక్టర్లు చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నవరత్నాలను ప్రజలకు చేరువయ్యేలా అందరూ కృషి చేయాలని ఛైర్మన్ ఆకాంక్షించారు. విజయవాడలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బోర్డు మీటింగ్ ను జరిగింది.
ఈ కార్యక్రమంలో చైర్మన్‌ షేక్ అసీఫ్ మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా రూ. 3,160 కోట్ల మేర లబ్ధి మైనార్టీ కార్పోరేషన్ ద్వారా అందజేశామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తుచేశారు. ఇంత భారీ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయూత అందించలేదన్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆశయ సాధన కోసం మన అందరం పనిచేయాలని, జగనన్నకు తోడుగా, అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలు, మంత్రులు, డిప్యూటీ సీఎంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని వచ్చేలా అందరూ పనిచేయాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న చేదోడు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ పెన్షన్, వైఎస్సార్ ఆసరా తదితర పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ ద్వారా 16,96,066 మంది లబ్ధిదారులకు రూ.3,160 కోట్లు ప్రభుత్వం అందించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సహకారంతో మైనార్టీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఛైర్మన్ తెలిపారు.
స్థానిక కార్పోరేటర్ రెహానా మాట్లాడుతూ.. కరోనా వంటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో నగదు బదిలీ ద్వారా దళారీ వ్యవస్థను రూపుమాపారని తెలిపారు. ముస్లిం మైనార్టీ మహిళలకు సీఎం జగన్ గౌరవం కల్పిస్తూ.. మహిళా సాధికారిత దిశగా అండగా నిలుస్తున్నారని తెలిపారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల పక్షపాతి, ముస్లింల శ్రేయోభిలాషి అని నూతన డైరెక్టర్లు కొనియాడారు. దివంగత నేత వైఎస్సార్‌ను మైనార్టీ ప్రజలు తమ జీవితంలో మరచిపోరని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి మైనార్టీల సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలను కూడా నెరవేరుస్తున్నారన్నారు. మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, నామినేట్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోనే తమకు డైరెక్టర్ పదవులు వచ్చాయని మహిళా డైరెక్టర్లు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ రెహానా, ఉర్డూ అకాడమీ డెరెక్టర్ అబీదా బేగం, మైనారిటీ సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ రోజ్ లతాభాయి, వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ అలీం భాషా, ముస్లిం మైనార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సాగు నీటి సంఘాల వ్యవస్థలన్నీ పునర్జీవం పోసుకుంటున్నాయి…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : అలంకారప్రాయంగా మారిన సాగు నీటి సంఘాల వ్యవస్థలన్నీ పునర్జీవం పోసుకుంటున్నాయని జిల్లా ఇంచార్జి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *