విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో గురువారం వై ఎన్ ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సేవలు అందించేందుకు సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను జిల్లా కలెక్టర్ జె.నివాస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వై ఎన్ఆర్ చారిటీస్ ద్వారా అందిస్తున్న సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పేద విద్యార్థులకు ఫీజుల విషయంలో కానీ, ఆరోగ్యపరంగా ట్రస్ట్ అండగా నిలవడం సంతోషదాయకమన్నారు.కోవిడ్ కష్టకాలంలో రోగులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ట్రస్ట్ ద్వారా అందించారని అన్నారు. నిరుపేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వై ఎన్ ఆర్ చారిటీస్ తరఫున అందించిన అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.వై ఎన్ ఆర్ చారిటీస్ సంస్థ అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు.
వైసీపీ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వైఎన్ఆర్ చారిటీస్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు పొందిందన్నారు. యలమంచలి జయ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించటం ఆనందదాయకమని దేవినేని అవినాష్ అన్నారు. తొలుత వైఎన్ఆర్ చారిటీస్ తరపున అంబులెన్స్ ని జిల్లా కలెక్టర్ జె. నివాస్ కి ట్రస్ట్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డా.బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెలగా జోషి, ట్రస్ట్ సభ్యులు జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.