Breaking News

మిస్డ్ కాల్ ద్వారా టెలిమెడిసిన్ సేవ‌లు – కోవిడ్ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ మ‌రో కార్య‌క్ర‌మం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ బాధితుల కోసం ఎన్టీ ఆర్ ట్ర‌స్ట్ మ‌రో కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వ‌డం ద్వారా కోవిడ్ కు వైద్య సాయం పొందే ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీ ఆర్ ట్ర‌స్ట్ ప్ర‌త్యేకంగా ఒక నెంబ‌ర్ ను కేటాయించింది. కోవిడ్ కు టెలిమెడిసిన్ సాయం కావాలి అనుకున్న వారు 8801033323 నెంబ‌ర్ కు మిస్డ్ కాల్ ఇవ్వ‌వ‌చ్చు. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్ కు టెలిమెడిసిన్ సేవ‌లు అందించించే జూమ్ కాల్ లింక్ వెళుతుంది. త‌ద్వారా కోవిడ్ బాధితులు జూమ్ లింక్ ద్వారా టెలిమెడిసిన్ సేవ‌లు పొంద‌వ‌చ్చు. అవ‌స‌రం ఉన్న కోవిడ్ బాధితుల‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నుంచి ఉచితంగా మందుల పంపిణీ కూడా జ‌రుగుతుంది. రోజూ ఉద‌యం 7.30 గంట‌లకు కోవిడ్ బాధితుల‌కు జూమ్ వీడియో కాన్ఫ‌రెన్స్ ఉంటుంది. మిస్డ్ కాల్ ద్వారా వైద్య సౌక‌ర్యం రేప‌టి నుంచి అందుబాటులోకి వస్తుంద‌ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప్ర‌క‌టించింది.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *