ఉండి, నేటి పత్రిక ప్రజావార్త :
తణుకు, తాడేపల్లిగూడెం పరిధిలో 54 స్కూల్స్ కి రైస్ మిల్లర్ అసోసియేషన్ తరపున మిడ్ డే మీల్స్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. బుధవారం ఉండి నియోజకవర్గ పరిధిలోని యండగండి గ్రామంలో పోలేరమ్మ గుడి, ఉన్నత పాఠశాల పునర్నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, మన స్కూల్, మన గ్రామం అభివృద్ధి కోసం ప్రజలు, పారిశ్రామిక వేత్తలు స్వచ్ఛందంగా కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను చిన్నప్పుడు 6 వ తరగతి నుంచి 10 వ తేదీ వరకు చదువు కున్న పాఠశాల అభివృద్ధి కు, మౌలిక సదుపాయాల కల్పన కి తనవంతు గా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంతో మంది ఇదే పాఠశాలలో చదువుకుని, పారిశ్రామిక వేత్తలు గా, రాజకీయ నేతలు గా, ఉన్నతాధికారులు ఉన్నారన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పద్ధతుల్లో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే నాడు-నేడు ద్వారా ఆయా పాఠశాలలు రూపురేఖలు పూర్తిగా మార్చి వేసి చక్కటి వాతావరణం ఏర్పడేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం తో పాటు ప్రజలు కూడా ఆయా గ్రామాల అభివృద్ధికి ముందుకు వొస్తే మన పిల్లలకీ మంచి భవిష్యత్తు ను అందించగలం అని పేర్కొన్నారు.తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని 54 పాఠశాలల్లో రైస్ మిల్లు అసోసియేషన్ తరపున మధ్యాహ్న భోజన పధకాన్ని మధురాన్నం సొసైటి ద్వారా నిర్వహిస్తున్నా మన్నారు. యండగండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు , ఇంటర్మీడియట్ చదువుతున్న 140 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 వ తరగతి వరకు చదువు కుంటున్న వారికి జగనన్న గోరుముద్ద, మధ్యహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాధ్ రాజు తెలిపారు. మేము చదువుకున్న స్కూల్ లో మధురాన్నం సొసైటీ ద్వారా ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు కూడా మధ్యహ్న భోజనం అందచేస్తున్నామన్నారు. అనంతరం యండగండి లో పునర్నిర్మాణం చేస్తున్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ దేవాలయం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
Tags Eluru
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …