Breaking News

ఎన్ టి ఆర్ స్టేడియం 2022-23 ఆర్ధిక సంవత్సరం స్పోర్ట్స్ బడ్జెట్ 28 లక్షల రూపాయలకు కమిటీ ఆమోదం…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడలోని ఎన్ .టి.ఆర్. స్టేడియం లో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 28 లక్షల రూపాయలతో ప్రతిపాదించిన స్పోర్ట్స్ బడ్జెట్ ను ఆమోదిస్తూ కమిటీ తీర్మానించింది. స్థానిక ఎన్..టి.ఆర్. స్టేడియం సమావేశపు హాలులో బుధవారం స్టేడియం సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ .టి.ఆర్. స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరంలో స్పోర్ట్స్ క్యాలెండర్ను అనుసరించి 22 క్రీడా కార్యక్రమాలు నిర్వహించేందుకు 28 లక్షల రూపాయలు స్పోర్ట్స్ బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్లు మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జె.నివాస్ వెల్లడించారు. ఎన్ .టి.ఆర్. స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని క్రీడలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. గుడివాడలోని ఎన్ .టి.ఆర్. స్టేడియంకు జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, ఆ గుర్తింపు నిలిపేలా క్రీడలు నిర్వహించాలన్నారు. స్టేడియంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 2017-18 నుండి 2020-21 ఆర్ధిక సంవత్సరాలకు సంబందించిన ఆడిట్ ఐన జామా ఖర్చులను కమిటీ ఆమోదించింది. అంతేయేకాక స్టేడియం కమిటీకి రావలసిన రాయల్టీ మొత్తం గురించి కోర్ట్ లో పెండింగ్ లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల చనిపోయిన స్టేడియం కమిటీ జీవిత సభ్యులు పోలవరపు సుబ్రహ్మణ్యేశ్వరరావు, రావి శోభనాద్రి చౌదరి, బొప్పన బాపినీటు ప్రసాద్, పిన్నమనేని రాజారావు, మున్నలూరి మాణిక్యాలరావు, డా. పొట్లూరి గంగాధరరావు మరణానంతరం తదుపరి వారి వారసులకు స్టేడియం కమిటీ జీవిత సభ్యత్వం స్టేడియం బైలా ప్రకారం మరొక తరం కొనసాగుటకు సమావేశం తీర్మానించింది. ఎన్ .టి.ఆర్. స్టేడియం ఆధ్వర్యం లో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణానికి స్థల సేకరణకు సమావేశం చర్చించింది. స్టేడియం నిర్వహణకు అదనపు ఆదాయం గురించి ఇండోర్ స్టేడియంలోని ఖాళీ స్థలంలో 7 వేల చదరపు అడుగులలో అదనపు నిర్మాణం మరియు స్టేడియం గాలరీ రూఫింగ్ నిర్మాణం గురించి సాంకేతిక నిపుణలతో చర్చించి, వారి సూచనల మేరకు చర్యలు తీసుకొనుటకు మరియు తదుపరి సమావేశంలో చర్చించుటకు సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన స్టేడియం సభ్యులు సంస్మరణార్ధం సమావేశం 2 నిముషాల సేపు మౌనం పాటించి సంతాపం తెలియజేసింది. అనంతరం మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జె.నివాస్ లను కమిటీ సభ్యులు దుశ్శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు.
అంతకుముంది మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ లు ఎన్ .టి. ఆర్. స్టేడియంలోని క్రీడా సౌకర్యాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ జి. శ్రీనుకుమార్, మున్సిపల్ చైర్మన్ పాలేటి వెంకట శివ సుబ్రహ్మణ్యేశ్వరరావు (చంటి),మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, , తహసిల్దార్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ జాయింట్ సెక్రటరీ పర్వతనేని ఆనంద్, సభ్యులు బొగ్గారపు తిరుపతయ్య, పొట్లూరి వెంకట కృష్ణారావు, నెరుసు శేషగిరిరావు , వల్లభనేని లక్ష్మి కృష్ణ వరప్రసాద్, చింతా రఘుబాబు, పిన్నమనేని పూర్ణ వీరయ్య, పాటిభండ్ల లక్ష్మణరావు, నర్రా రత్న శేఖర రావు, గుండిమెడ వెంకట రాఘవేంద్ర రావు, లంకదాసరి ప్రసాద రావు, జి. బాబు శేఖర్, శ్రీమతి రూపలావణ్య, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *