Breaking News

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గవర్నర్‌ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి సాదరంగా స్వాగతం పలికారు. అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో దేవాలయంలోకి తోడ్కొని వెళ్లారు. అనంత‌రం ఆయ‌న ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ హ‌రిచంద‌న్ కు వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు బహూకరించారు. అంతకు ముందు తిరుమల శ్రీ పద్మావతి వసతి సముదాయం వద్ద టీటీడీ ఉన్నతాధికారులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *