అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనుమరాలి వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయం చెంతన ఈ వేడుక జరగగా, వధూవరులు సుష్మ, కిషన్ లను గవర్నర్ ఆశీర్వదించారు. సుష్మ స్వర్ణ భారత్ ట్రస్ట్ ట్రస్టీ దీపా వెంకట్ కుమార్తె కాగా కరోనా నేపథ్యంలో ఎటువంటి హడావిడికి తావు లేకుండా ముఖ్యుల సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించారు. తరువాత శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ , హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
Tags AMARAVARTHI
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …