కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలంలో ఈ నెల 22 నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీశైలం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అడవి మార్గంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. అన్నదానం, మంచినీరు సౌకర్యాలు సిద్దం చేశామన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. సంప్రదాయబద్దంగా మహాశివరాత్రి ఉత్సవాల క్రతువులు నిర్వహిస్తామని ఆలయ ఈఓ లవన్న పేర్కన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యామన్నారు.
Tags karnul
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …