Breaking News

పేద క్రీడాకారులకు యూజర్ ఫీజు నుండి మినహాయింపు…

-రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పేద క్రీడాకారులకు చందా నుండి మినహాయింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పే అండ్ ప్లే పధకం కింద పేద క్రీడాకారుల నుండి యూజర్ ఫీజు వసూలు నుండి మినహాయింపు, రాష్ట్ర, జాతీయ క్రీడాపోటీల్లో పతకాలు సాధించి చందా చెల్లించలేని స్థితిలో ఉన్న క్రీడాకారులకు చందా చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వాలన్న రాష్ట్ర పర్యాటకశాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాసరావు) వారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్పోర్ట్సు అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పరిధిలోని అందరు సిఇఓలు, చీఫ్ కోచ్ లు, స్టేడియంల అడ్మినిస్ట్రేటర్లను ఒక సర్కులర్ ఆదేశాలను జారీ చేశారు. అదే విధంగా శాప్ లీగ్ టోర్నమెంట్లలో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలు,కళాశాలల్లో చదువుతున్న క్రీడాకారులు వారి గుర్తింపు కార్డులు చూపించి ఈమినహాయింపు పొందవచ్చని తెలిపారు. చందా చెల్లించలేని స్థితిలో ఉన్న క్రీడాకారుల జాబితాను సర్టిఫికెట్లతో సహా పంపాల్సిందిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)కు చెందిన అందరు సిఇఓలు,చీఫ్ కోచ్ లు, స్టేడియంల అడ్మినిస్ట్రేటర్లను ఆయన ఆదేశించారు.గతంలో వివిధ క్రీడా విభాగాల్లో పే అండ్ ప్లే పధకం కింద జిల్లా సంయుక్త కలక్టర్లు(విడబ్ల్యుఎస్ అండ్ డి)నిర్దేచించిన ధరల ప్రకారం చందాలు వసూలు చేసి పంపాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.అయితే ఆవిధంగా చందాలు చెల్లించే స్థితిలో లేని రాష్ట్ర,జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన వారికి చందాల నుండి మినహాయింపు నిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *