Breaking News

లేఅవుట్ల అనుమతి కొరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి నగరంలో వివిధ ప్రాంతములలో లేఅవుట్ల అనుమతి కొరకు వచ్చిన దరఖాస్తులకు సంబందించిన స్థలములను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. ఫుడ్ జంక్షన్ ప్రాంతములో పెట్రోల్ బంక్ ఏర్పాటు అనుమతి కొరకు వచ్చిన దరఖాస్తునకు సంబందించిన ప్రదేశమును మరియు పలు ప్రాంతాలలో లేఅవుట్ల అనుమతి కొరకు వచ్చిన ప్రతిపాదిత స్థలములను పరిశీలన జరిపినారు. సర్వే నెంబర్లతో సహా భూరికార్డుల వివరములు, నియమ నిబంధనలు, ప్రభుత్వమునకు చెల్లించవలసిన ఫీజులు అన్నియు పూర్తిగా చెల్లించునట్లు ఇతర విభాగముల నుండి పొందవలసిన అనుమతులు పొందునట్లు చూడవలెనని, భవన నిర్మాణ నిబంధనలు లేఅవుట్ల అనుమతి కొరకు అనుసరించవలసిన విధి విధానములపై వార్డు ప్లానింగ్ సెక్రటరీలు ద్వారా తగు అవగాహన కల్పించవలెనని ప్రణాళికాఅధికారిని ఆదేశిoచినారు. ఈ పర్యటనలో సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, టి.పి.ఓ లు లక్ష్మీనారాయణ, బేగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *