Breaking News

పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 4.01 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో 11 మంది లబ్ధిదారులకు రూ. 4.01 లక్షలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులాలు, మతాలు, పార్టీలకతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతోందన్నారు. మరీముఖ్యంగా పేదల ఆరోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవల్లో ఘననీయమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. కోవిద్ బాధితులకు ఉచితంగా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచామన్నారు. అంతేకాకుండా ఆస్పత్రులను గ్రీన్ ఛానల్స్ లో చేర్చి ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి ముందుకు రావడం చారిత్రాత్మకమన్నారు.

నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆధునిక వైద్యసేవలు పొందేందుకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు పాలనలో పేద రోగులు ఆర్థిక భారంతో తీవ్రంగా చితికిపోయేవారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరవుతోందని పేర్కొన్నారు. కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఆపద వస్తే అధైర్యపడొద్దని సూచించారు. అలాగే ప్రజారోగ్య సంరక్షణకు నియోజకవర్గంలో 4 హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 761 మందికి రూ. 3 కోట్ల 63 లక్షల 57 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. 83 మందికి రూ. 2 కోట్ల 18 లక్షల 12 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసిలను అందించినట్లు వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం, ఆరోగ్యశ్రీ కలిగిన ఆస్పత్రులపై వారికి విస్తృత అవగాహన కల్పించేందుకు గాను నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు కొండాయిగుంట మల్లీశ్వరి, అలంపూర్ విజయలక్ష్మి, ఎండి షాహినా సుల్తానా, ఇసరపు దేవి, నాయకులు గుండె సుందర్ పాల్, అవుతు శ్రీనివాస్ రెడ్డి, హఫీజుల్లా, అలంపూర్ విజయ్, కుక్కల రమేష్, ఇసరపు రాజా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *